Telugu Global
Andhra Pradesh

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

ఇప్పటికే సామాజిక పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం చేసి లబ్ధిదారుల ఉసురు పోసుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు డీబీటీ పథకాలకు కూడా మోకాలడ్డి వారిని అవస్థలు పెడుతున్నారు.

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
X

జగన్ పాలనలో 58 నెలలుగా ఎక్కడా ఎలాంటి అవాంతరం లేకుండా లబ్ధిదారులకు డీబీటీ చెల్లింపులు జరిగిపోయాయి, అవ్వాతాతలకు పెన్షన్ ఇంటి వద్దకే వచ్చింది. కానీ ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే చంద్రబాబులోని మరో కోణం బయటపడింది. ఇన్నాళ్లూ పేదలకు కష్టం రాకుండా చూసిన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు చేయడం ద్వారా ఆయన లబ్ధిదారులపై కక్ష తీర్చుకుంటున్నారు.

వైఎస్సార్ ఆసరా, విద్యా దీవెన, ఇన్ పుట్ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం.. వంటి పథకాల చెల్లింపులు చివరి దశలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయి. కోడ్ కారణంగా అని చెప్పడం కంటే టీడీపీ కారణంగా అని చెప్పడం కరెక్ట్. టీడీపీ మోకాలడ్డడం వల్లే ఈ పథకాల చెల్లింపులు చివరి దశలో కొందరికి ఆగిపోయాయి. దీంతో అధికారులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరారు. అక్కడ కూడా అనుమతి రాకుండా టీడీపీ అడ్డుపుల్లలు వేస్తోంది. అందుకే ఇప్పటి వరకు అనుమతులు రాలేదు, డీబీటీ చెల్లింపులు పూర్తి కాలేదు.

గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లోనే నిధులు కేటాయించి, ఈ ఏడాది మార్చిలో ఎన్నికల కోడ్ రాకముందే డీబీటీ పథకాలకు బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు సీఎం జగన్. దాదా70నుంచి 80శాతం మందికి కోడ్ అమలులోకి రాకముందే బ్యాంక్ అకౌంట్లలో నిధులు జమ అయ్యాయి. మిగతా 20నుంచి 30శాతం చెల్లింపులు కోడ్ అమలులోకి రావడంతో నిలిచిపోయాయి. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందునుంచీ అమలవుతున్న పథకాలకు, బడ్జెట్ లో నిధులు కేటాయించిన వాటికి.. కోడ్ అడ్డు రాదు. కొత్త లబ్ధిదారులను మాత్రం ఎంపిక చేయడం కుదరదని ఎన్నికల నియమావళి చెబుతోంది. కానీ చంద్రబాబు అండ్ కో.. పాత లబ్ధిదారులకు కూడా నిధులు జమ కాకుండా అడ్డుకుంది. డ్వాక్రా చెల్లింపులు ఆగిపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. విద్యా దీవెన పథకానికి కూడా అడ్డుపుల్ల పడటంతో కొందరు విద్యార్థులు నిధులు జమకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

15రోజుల క్రితం లేఖ..

లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిధుల విడుదలకు అనుమతి కావాలని కోరుతూ 15 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. కానీ అనుమతులు రాలేదు, కారణం టీడీపీ అని తేలిపోయింది. ఇప్పటికే సామాజిక పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం చేసి లబ్ధిదారుల ఉసురు పోసుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు డీబీటీ పథకాలకు కూడా మోకాలడ్డి వారిని అవస్థలు పెడుతున్నారు.

First Published:  4 May 2024 4:36 AM GMT
Next Story