Telugu Global
Andhra Pradesh

వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు..

ఈసారి ముస్లిం వర్గం నుంచి చంద్రబాబుకి ఒక్క ఓటు కూడా పడదని తేలిపోయింది. అందుకే ఎన్నికల ముందు కవరింగ్ యాత్రలు మొదలు పెట్టారు.

వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు..
X

టీడీపీ హయాంలో రొట్టెల పండగను రాష్ట్ర పండగ చేశాం..

వైసీపీ హయాంలో నాసిరకం మద్యం తాగి మీ కిడ్నీలు పాడైపోతున్నాయి

నిత్యావసరాలతోపాటు అన్ని ధరలు పెరిగి మీరు ఇబ్బంది పడుతున్నారు..

నెల్లూరులో ముస్లింలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ప్రసంగ సారాంశం ఇది. నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగను రాష్ట్ర పండగగా చేశాం, మైనార్టీల అభివృద్ధికి పాటుపడ్డామని గొప్పగా చెప్పారు చంద్రబాబు. దానివల్ల ముస్లింలకు ఒరిగిందేంటి..? పైగా ముస్లింలంతా మందుతాగి కిడ్నీలు పాడు చేసుకుంటున్నారంటూ మరో పెద్ద నిందవేసి తన నీఛ బుద్ధిని బయటపెట్టుకున్నారు చంద్రబాబు. ఎన్డీఏతో జతకలిసి ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేయడానికి చూస్తున్న గుంటనక్క చంద్రబాబు.. తెల్ల టోపీ పెట్టుకుని నెల్లూరులో మైనార్టీల ఉద్ధారకుడిలాగా బిల్డప్ ఇచ్చారు.

ఏపీలో ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిందే వైసీపీ. డిప్యూటీ సీఎం పదవితోపాటు, మండలిలో డిప్యూటీ చైర్మన్ గా కూడా ముస్లింనే చేశారు. ఈ సారి వైసీపీ 7 అసెంబ్లీ సీట్లు మస్లింలకు కేటాయిస్తే టీడీపీ ఇచ్చినవి కేవలం 3 సీట్లు. అంతే కాదు సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా ఐదేళ్లలో ముస్లింలకు 25వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జగన్. మరి వీరిద్దరిలో ముస్లిం పక్షపాతి ఎవరు. బీజేపీతో స్నేహం చేస్తూ సెక్యులర్ ముసుగు వేసుకుని తిరుగుతున్న చంద్రబాబుని ముస్లింలు నమ్మడం సాధ్యమేనా. రిజర్వేషన్లు తీసేస్తామంటూ ఖరాఖండిగా చెబుతున్న అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించలేని చంద్రబాబుకి ముస్లింలు ఎందుకు ఓటు వేయాలి..? ఇతర రాష్ట్రాలలో ముస్లింలపై బీజేపీ కార్యకర్తలు దాడులు చేసిన సందర్భాల్లోనూ చంద్రబాబు మౌనం వహించారు. కాశ్మీర్‌ వివాదంలో, ఆర్టికల్‌ 370 రద్దు అంశంలో చంద్రబాబు నాయుడు బిజెపికి అనుకూలమైన వైఖరి తీసుకున్నారు. హిజాబ్‌ వివాదాన్ని రెచ్చగొట్టిన టైమ్ లో కూడా బాబు తన నోటికి తాళం వేసుకున్నారు. ఆఖరికి సీఏఏ అమలును కూడా బాబు వ్యతిరేకించడం లేదంటే ముస్లింలపై ఆయనకు ఎంత కక్ష ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నికల వేళ మాత్రం వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేస్తున్నట్టు.. టోపీ పెట్టుకుని ముస్లింలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారు చంద్రబాబు. షాదీమంజిల్ భవనాలు మొదలు పెట్టారు కానీ, నిధులివ్వకుండా మొహం చాటేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తే, ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు. ఎన్నికలప్పుడు వచ్చి అన్నీ తానే చేశానంటూ బిల్డబ్ ఇస్తున్నారు. ఈసారి ముస్లిం వర్గం నుంచి చంద్రబాబుకి ఒక్క ఓటు కూడా పడదని తేలిపోయింది. అందుకే ఎన్నికల ముందు కవరింగ్ యాత్రలు మొదలు పెట్టారు.

First Published:  28 April 2024 11:37 AM GMT
Next Story