Telugu Global
Andhra Pradesh

ఎన్డీఏలోకి ఎందుకంటే..? బాబు చెబుతున్న కట్టుకథ ఇదే..

తిరిగి ఎన్డీఏ గూటికి వెళ్తున్న బాబు ఓ అందమైన కట్టుకథ రెడీ చేసుకున్నారు. ఆయన బీజేపీ దగ్గరకు వెళ్లలేదట, మోదీయే ఆయన్ను ఆహ్వానించారట.

ఎన్డీఏలోకి ఎందుకంటే..? బాబు చెబుతున్న కట్టుకథ ఇదే..
X

హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చెప్పగలరు, అదే నోటితో హోదా కోసమే ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నామని నాలుక మడతపెట్టేయగలరు. ప్రధాని మోదీని చెడామడా తిట్టిన నోటితోనే ఆయన మహానేత అని పొగడగలరు. చివరికిప్పుడు అవకాశవాదంతో మళ్లీ బీజేపీ పంచన చేరడానికి కూడా సిగ్గుపడరు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా పొత్తులు, ఎత్తులు, బేరసారాలకే సరిపోయింది. తిరిగి ఎన్డీఏ గూటికి వెళ్తున్న బాబు ఓ అందమైన కట్టుకథ రెడీ చేసుకున్నారు. ఆయన బీజేపీ దగ్గరకు వెళ్లలేదట, మోదీయే ఆయన్ను ఆహ్వానించారట.

నిస్సిగ్గుగా..

బీజేపీతో దోస్తీకి రెండేళ్లుగా చంద్రబాబు పరితపిస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. మొదట్లో బీజేపీ నేతలు చంద్రబాబుని ఛీ కొట్టారు, చీదరించుకున్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో నెరిపిన రాయబారాలు కూడా ఫెయిలయ్యాయి. చివరకు ఏపీలో టీడీపీ-జనసేన కలసిపోయి బీజేపీ వెంట పడేందుకు ప్రయత్నించగా ఇప్పటికి ఆ వ్యూహం ఫలించింది, చంద్రబాబుని బీజేపీ కరుణించింది. కానీ ఇది కాళ్లబేరం కాదట, బీజేపీయే తమతో కుదుర్చుకున్న బేరం అంటున్నారు బాబు. ఎల్లో మీడియా ద్వారా ఓ అందమైన కట్టుకథ ప్రచారంలోకి తెస్తున్నారు.

"వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్య సాధనలో ఎన్డీఏ పూర్వ మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానించారు. అందులో భాగంగా టీడీపీకి కూడా ఆహ్వానం లభించింది. దీంతో చంద్రబాబు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు." ఇదీ టీడీపీ ప్రచారం చేస్తున్న కొత్త కథ.

ప్రత్యేక హోదాకోసం ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ హామీతో ఆ కూటమిలో చేరుతున్నారని వైరి వర్గాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. దిక్కులేని పరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలుపుతున్న బాబు, దాన్ని కవర్ చేసుకోడానికి ఈ కట్టుకథ రెడీ చేశారు. బీజేపీనుంచి ఆహ్వానం అందిందని, రాష్ట్ర ప్రయోజనాలకోసం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోడానికి ఎన్డీఏలో చేరుతున్నట్టు చెబుతున్నారు.

First Published:  9 March 2024 2:37 AM GMT
Next Story