Telugu Global
Andhra Pradesh

ప్రతి ఇంటికి రూ.2500 సాయం.. - సీఎం జగన్

పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, ఏ ఒక్కరినీ నష్టపోనివ్వమని అన్నారు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని తెలిపారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లను త్వరితగతిన బాగు చేస్తామని వివరించారు.

ప్రతి ఇంటికి రూ.2500 సాయం.. - సీఎం జగన్
X

తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ పర్యటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి రైతులతో మాట్లాడారు. వాకాడు మండలంలో తెగిపోయిన స్వర్ణముఖి నది కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన వారు బాధపడాల్సిన అవసరం లేదని, ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ. 2500 చొప్పున సాయం అందజేసినట్లు చెప్పారు. ఇంకా అందని వారికి వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి సాయాన్ని అందిస్తారని తెలిపారు. తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో 92 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ చెప్పారు. 60 వేల మంది బాధితులకు 25 కేజీల చొప్పున రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను అందించినట్లు వివ‌రించారు.

పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, ఏ ఒక్కరినీ నష్టపోనివ్వమని అన్నారు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని తెలిపారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లను త్వరితగతిన బాగు చేస్తామని వివరించారు.

వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ హామీలను వారం రోజుల్లో నెరవేరుస్తామన్నారు. జిల్లా కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తారని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎవరికైనా సాయం అందకపోతే 1902 నంబర్ కి ఫోన్ చేస్తే తన కార్యాలయానికే కాల్ వస్తుందని చెప్పారు.

First Published:  8 Dec 2023 2:04 PM GMT
Next Story