Telugu Global
Andhra Pradesh

ఫ్లెక్సీల తొలగింపుపై జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

తన బావ చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం ఆనాడు కన్న తండ్రి ఎన్టీఆర్‌కు బాలకృష్ణ వెన్నుపోటు పొడిచారని, ఆ తర్వాత హరికృష్ణను కూడా వెంటాడారని జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం గుర్తుచేసింది.

ఫ్లెక్సీల తొలగింపుపై జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌
X

చంద్రబాబు, బాలకృష్ణల తీరుపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వారికి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టంచేశారు. బాబు, బాలయ్యలను ఈసారి రాజకీయ బిక్షగాళ్లను చేయడం తథ్యమని హెచ్చరించారు. అఖిల భారత జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం ఈ హెచ్చరిక చేయడం గమనార్హం.

అసలేమైందంటే.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే గురువారం నందమూరి బాలకృష్ణ వాటిని తొలగింపజేశారు. దీనిపై ఎన్టీఆర్, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులైతే ఒక రేంజ్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించాలని టీడీపీ కార్యకర్తలను బాలకృష్ణ ఆదేశించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ని బాలకృష్ణ అంతగా ద్వేషిస్తుండటం తమ మనసులను కలచివేస్తోందని అఖిల భారత జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

తన బావ చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం ఆనాడు కన్న తండ్రి ఎన్టీఆర్‌కు బాలకృష్ణ వెన్నుపోటు పొడిచారని, ఆ తర్వాత హరికృష్ణను కూడా వెంటాడారని జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం గుర్తుచేసింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ని చంద్రబాబు, బాలకృష్ణ టార్గెట్‌ చేస్తున్నా ఇన్నాళ్లూ భరించామని.. ఇక మీదట ఏమాత్రం ఉపేక్షించేది లేదని జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు తేల్చిచెప్పారు. బాలకృష్ణ అహంకారాన్ని అణచి ఆయన మదాన్ని వేటాడబోతున్నామని వారు స్పష్టం చేశారు.

First Published:  19 Jan 2024 4:09 AM GMT
Next Story