Telugu Global
Andhra Pradesh

జనసేనలో చంద్రబాబు కోవర్టు పవన్.. ఆర్జీవీ సంచలన కామెంట్

కొల్లాపూర్ లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్క పవన్ కళ్యాణ్ కంటే ఎంతో నయం అని ఇటీవల కామెంట్స్ చేసిన వర్మ మరోసారి పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

జనసేనలో చంద్రబాబు కోవర్టు పవన్.. ఆర్జీవీ సంచలన కామెంట్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తరచూ విమర్శలు చేసే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ఆయ‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ జనసేనలో చంద్రబాబు కోవర్టు అన్నారు. వర్మ చేసిన ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. వర్మ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పవన్ కళ్యాణ్‌కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే రాంగోపాల్ వర్మ.. రాజకీయ పరంగా మాత్రం పవన్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతుంటాడు. సమయం, సందర్భం దొరికితే చాలు పవన్ పై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తుంటాడు. తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్క పవన్ కళ్యాణ్ కంటే ఎంతో నయం అని ఇటీవల కామెంట్స్ చేసిన వర్మ మరోసారి పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

'పవన్ కళ్యాణ్ జనసేనలో చంద్రబాబు నాయుడు కోవర్టు అని నేను అనుకుంటున్నాను' అని ఆర్జీవీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా రిప్ల‌య్‌లు ఇస్తున్నారు.

First Published:  14 Dec 2023 11:55 AM GMT
Next Story