Telugu Global
Andhra Pradesh

ఊపిరి పీల్చుకున్న మంత్రి జోగి రమేష్.. 3 వారాల హైడ్రామాకి తెర!

మంత్రి జోగి రమేష్ ఒత్తిడి కారణంగానే ఆదినారాయణ సూసైడ్ చేసుకున్నాడని టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో గత నెల 25 నుంచి వివరణ ఇచ్చుకోలేక మంత్రితో పాటు వైసీపీ కూడా ఇబ్బంది ప‌డింది.

ఊపిరి పీల్చుకున్న మంత్రి జోగి రమేష్.. 3 వారాల హైడ్రామాకి తెర!
X

ఏపీలో ఎన్నికల ముంగిట మంత్రి జోగి రమేష్‌ ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. మూడు వారాలు క్రితం మంత్రి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ యారగాని ఆదినారాయణ అదృశ్యమయ్యాడు. కోడూరు- ఉల్లిపాలెం వంతెన నుంచి దూకి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు మిస్సింగ్‌కి ముందు ఆదినారాయణ స్టేటస్ పెట్టాడు. దాంతో పోలీసులు రెండు రోజుల పాటు కృష్ణా నదిలో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు.

మంత్రి మెడకు చుట్టే ప్రయత్నం

మంత్రి జోగి రమేష్ ఒత్తిడి కారణంగానే ఆదినారాయణ సూసైడ్ చేసుకున్నాడని టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో గత నెల 25 నుంచి వివరణ ఇచ్చుకోలేక మంత్రితో పాటు వైసీపీ కూడా ఇబ్బంది ప‌డింది. కానీ.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా స్టేటస్ పెట్టిన రోజే అతను కోడూరులో ఆటో దిగినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. కానీ.. టీడీపీ మాత్రం తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆపలేదు.

చిన్న తప్పిదంతో దొరికిన ఫొటో‌గ్రాఫర్

వారణాసికి పారిపోయిన ఆదినారాయణ అక్కడి నుంచి వేరే నంబరుతో తన బంధువుకు ఫోన్ చేశాడు. దాంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ నంబరు ఆధారంగా వారణాసికి వెళ్లి ఆదినారాయణని అదుపులోకి తీసుకుని పెడనకు తీసుకొచ్చారు. దాంతో మూడు వారాలుగా టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి పూర్తిగా తెరపడినట్లయ్యింది.

అసలు ట్విస్ట్.. అప్పులు

మంత్రి జోగి రమేష్ వద్ద సుదీర్ఘకాలంగా ఫొటో‌గ్రాఫర్‌గా పనిచేస్తున్న ఆదినారాయణ జల్సాలకు అలవాటుపడి పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. దాంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి తప్పించుకోవడానికి సూసైడ్ చేసుకుంటున్నట్లు మెసేజ్ పెట్టి వారణాసికి పారిపోయాడు. అయితే.. తన బంధువుకు ఫోన్ చేయడం ద్వారా పోలీసులకు దొరికిపోయాడు. ఆదినారాయణ మిస్సింగ్ కేసుని రాష్ట్రంలోని చాలా కేసులతో ముడిపెడుతూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే.. అప్పుల బాధతో అతను పారిపోయినట్లు తేలడంతో ఇప్పుడు టీడీపీ సైలెంట్ అయిపోయింది.

First Published:  17 Oct 2023 3:43 AM GMT
Next Story