Telugu Global
Andhra Pradesh

`యాత్ర‌-2`కు సూప‌ర్‌ క్రేజ్‌.. యూఎస్‌లో వైఎస్ అభిమానుల భారీ ర్యాలీ

ఈ సినిమా విడుద‌లను పుర‌స్క‌రించుకుని అమెరికాలో వేల మంది వైఎస్ఆర్‌, జ‌గ‌న్ అభిమానులు కార్లు, ద్విచ‌క్ర‌వాహ‌నాల్లో యాత్ర 2 పోస్ట‌ర్లు చేత బ‌ట్టుకుని భారీ ర్యాలీ నిర్వ‌హించారు.

`యాత్ర‌-2`కు సూప‌ర్‌ క్రేజ్‌.. యూఎస్‌లో వైఎస్ అభిమానుల భారీ ర్యాలీ
X

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానంలో కీల‌క ఘ‌ట్టాల‌తో గ‌త ఎన్నిక‌ల స‌మయంలో తీసిన యాత్ర సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఇప్పుడు వైఎస్ఆర్‌ త‌న‌యుడు జ‌గ‌న్ రాజ‌కీయ అరంగేట్రం, 2009 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకున్న కీల‌క రాజ‌కీయ ప‌రిణామాల‌తో యాత్ర-2 సినిమా ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ‌ చిత్రీక‌రించారు. విడుద‌ల‌కు ప‌లు అవాంత‌రాలు ఏర్ప‌డినా అన్నింటినీ దాటుకొని ఈ నెల 8న విడుద‌ల కానుంది. అమెరికాలో ఫిబ్ర‌వ‌రి 7నే యాత్ర‌-2 రిలీజ్ కానుంది

భారీ ర్యాలీ తీసిన అభిమానులు

యాత్ర-2 సినిమాకు వ‌స్తున్న క్రేజ్ చూసి అమెరికాలోని టెక్సాస్‌, ఫ్లోరిడాల్లో స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షోలు వేయ‌డానికి సిద్ధం చేశారు. ఈ సినిమా విడుద‌లను పుర‌స్క‌రించుకుని అమెరికాలో వేల మంది వైఎస్ఆర్‌, జ‌గ‌న్ అభిమానులు కార్లు, ద్విచ‌క్ర‌వాహ‌నాల్లో యాత్ర 2 పోస్ట‌ర్లు చేత బ‌ట్టుకుని భారీ ర్యాలీ నిర్వ‌హించారు. తండ్రి మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్ ఎదుర్కొన్న ఇబ్బందులు, రాజ‌కీయాల్లో ప్ర‌జానేత‌గా ఎద‌గ‌డం, టీడీపీతో పాటు ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ప‌న్నిన కుట్ర‌ల‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు.

First Published:  6 Feb 2024 1:12 PM GMT
Next Story