Telugu Global
Andhra Pradesh

పాల‌న‌ను ప్ర‌జ‌ల ముంగిట‌కు తీసుకెళ్లిన వాలంటీర్ల‌కు వంద‌నం

పంచాయ‌తీల్లో, మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లో క‌నీసం 50 కుటుంబాల‌కు ఒక వాలంటీరును నియ‌మించారు. ఒక‌టో తేదీన వేకువ‌జామున ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్ ఇవ్వ‌డం నుంచి ఎలాంటి ప్ర‌భుత్వ ప‌థ‌కాన్న‌యినా జ‌నం ఇంటి ముంగింట‌కే చేర్చ‌డం వీరి విధి.

పాల‌న‌ను ప్ర‌జ‌ల ముంగిట‌కు తీసుకెళ్లిన వాలంటీర్ల‌కు వంద‌నం
X

ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ, ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ అంత‌కు ముందున్న ప్ర‌భుత్వాల‌కు, వైసీపీ ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తున్న‌ది ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌ల గుమ్మం ముంగిట‌కు తేవ‌డంలోనే. ఆ ప్ర‌క్రియ‌లో భాగంగా జ‌గ‌న్ చేసిన రెండు ప్ర‌యోగాలు సూప‌ర్ హిట్ట‌య్యాయి. అందులో ఒక‌టి వాలంటీర్ల వ్య‌వ‌స్థ అయితే రెండోది స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌. ఈ రెండింటితో ప్రభుత్వం నుంచి అందే ఏ సాయ‌మైనా, ఎలాంటి ప‌థ‌క‌మైనా అందుకోవ‌డం చాలా సులువుగా మారింది. నామమాత్ర‌పు గౌర‌వ వేత‌నంతో ప‌ని చేస్తున్న వాలంటీర్ల‌కు ప్రోత్సాహ‌కంగా ఏటా ప‌నితీరును బ‌ట్టి న‌గ‌దు పుర‌స్కారాలు ఇస్తుంది. ఈ ఏడాది ఆ మొత్తాన్ని మ‌రో 50 శాతం పెంచి ఇవ్వ‌బోతోంది ప్ర‌భుత్వం.

ఇంటికే వ‌చ్చి సేవ‌లు

పంచాయ‌తీల్లో, మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లో క‌నీసం 50 కుటుంబాల‌కు ఒక వాలంటీరును నియ‌మించారు. ఒక‌టో తేదీన వేకువ‌జామున ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్ ఇవ్వ‌డం నుంచి ఎలాంటి ప్ర‌భుత్వ ప‌థ‌కాన్న‌యినా జ‌నం ఇంటి ముంగింట‌కే చేర్చ‌డం వీరి విధి. క‌రోనా క‌ష్ట‌కాలంలో వాలంటీర్లు ఆప‌ర్బాంధ‌వులే అయ్యారు. వైర‌స్ సోకిన‌వారికి మందులు, ఆహారం కూడా ఇంటికే తీసుకెళ్లి అందించి, వారు కోలుకునేవ‌ర‌కు చూసుకుని ఎంతోమంది ప్రాణాలు నిల‌బెట్టారు. క‌రోనా వేళ ఇత‌ర ప్రాంతాల్లో ఉండిపోయిన‌వారికి సొంతూళ్ల‌లో పెన్ష‌న్‌, రేష‌న్ లాంటి ప్రభుత్వ ప‌థ‌కాలు ఆగిపోకుండా, వారు తిరిగొచ్చాక అన్ని నెల‌ల పెన్ష‌న్‌, రేష‌న్ ఇంటికేతెచ్చి అందించిన ఘ‌న‌త వాలంటీర్ల‌దే.

నేటి నుంచి న‌గ‌దు పుర‌స్కాల ప్ర‌దానం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,55,464 మంది వాలంటీర్ల‌కు న‌గ‌దు ప్రోత్సాహ‌కాలుగా రూ.392 కోట్లు ఇవ్వ‌నున్నారు. నేటి నుంచి వారం రోజుల‌పాటు ఈ అవార్డులు, న‌గ‌దు పుర‌స్కారాలు ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.సేవా వ‌జ్ర కింద నియోజ‌క‌వ‌ర్గానికి 5 మంది వాలంటీర్ల‌ను ఎంపిక చేసి ఒక్కొక్క‌రికి రూ.30వేలు ఇచ్చేవారు. దీన్ని ఈసారి రూ.45 వేల‌కు పెంచారు. ప్ర‌తి మండ‌లం, మున్సిపాల్టీలో 5మంది, కార్పొరేష‌న్ ప‌రిధిలో 10 మంది చొప్పున ఎంపిక చేసి వారికి సేవార‌త్న కింద రూ.20 వేల చొప్పున ఇచ్చేవారు. దీన్ని ఈసారి రూ.30వేల‌కు పెంచారు. అలాగే మిగిలిన 2 ల‌క్షల 50 వేల మంది వాలంటీర్ల‌కు సేవామిత్ర కింద ఇచ్చే రూ.10 వేల మొత్తాన్ని రూ.15వేల‌కు పెంచారు. పాల‌న‌ను ప్ర‌జ‌ల ముంగిట‌కు తీసుకెళుతున్న వాలంటీర్ల సేవ‌ల‌కు ఇది వంద‌న‌మే.

First Published:  15 Feb 2024 6:26 AM GMT
Next Story