Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుపై జోకులు.. రాజ్యసభలో నవ్వులే నవ్వులు

చంద్రబాబు కనిపెట్టిన వస్తువులకు పేటెంట్‌ తీసుకుంటే భారత్‌ కు కోట్ల రూపాయల్లో ఆదాయం గ్యారంటీ అంటూ వ్యంగ్యస్త్రాలు విసిరారు విజయసాయిరెడ్డి.

చంద్రబాబుపై జోకులు.. రాజ్యసభలో నవ్వులే నవ్వులు
X

పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మరోసారి చర్చ వచ్చింది. పార్లమెంట్ మొదలైన రోజు చంద్రబాబు అవినీతి, వెన్నుపోట్ల వ్యవహారాన్ని సభముందుకు తీసుకొచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరోసారి ఆయన గురించి చెప్పి సభలో నవ్వులుపూయించారు. సెల్ ఫోన్ సృష్టికర్త తానేనని చంద్రబాబు చెప్పుకుంటారని అన్నారు.


చంద్రయాన్‌ విజయంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. భారత దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సైంటిస్ట్ లను కట్టడి చేసిందని నంబి నారాయణ్ ఉదంతాన్ని గుర్తు చేశారు. నంబికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా జైలులో పెట్టి వేధించారన్నారు. రాజకీయ నాయకులపై కక్షసాధింపుకోసం కేసులు పెట్టిన కాంగ్రెస్, సైంటిస్ట్ లపై కూడా కేసులు పెట్టింద మండిపడ్డారు. 2014నుంచి, బీజేపీ హయాంలో భారత్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం పురోగమించిందని చెప్పారు విజయసాయిరెడ్డి.

కాంగ్రెస్, బీజేపీ మధ్యలో చంద్రబాబు తన గొప్పలు చెప్పుకుంటారని అన్నారు విజయసాయిరెడ్డి. స్పేస్ రీసెర్చ్ కి పితామహుడిని అని చంద్రబాబు చెప్పుకుంటారని, కంప్యూటర్, సెల్ ఫోన్ కనిపెట్టింది తానేనని అంటారని, వాటన్నిటిపై నిజ నిర్థారణ చేయాలని సభను కోరారు. చంద్రబాబు కనిపెట్టిన వస్తువులకు పేటెంట్‌ తీసుకుంటే భారత్‌ కు కోట్ల రూపాయల్లో ఆదాయం గ్యారంటీ అంటూ వ్యంగ్యస్త్రాలు విసిరారు. విజయసాయి ప్రసంగంతో సభలో నవ్వులు మొదలయ్యాయి.

First Published:  20 Sep 2023 1:19 PM GMT
Next Story