Telugu Global
Andhra Pradesh

బస్ షెల్టర్ పడిపోయింది.. అది కూడా జగన్ తప్పేనా..?

అంత ఖర్చు పెట్టారంటే దాని నిర్మాణం కూడా అదే క్వాలిటీతో ఉండాలి. మంత్రులు, జీవీఎంసీ మేయర్ అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేశారు. కానీ బస్ షెల్టర్లు ప్రారంభించి నెలరోజులు కాకముందే అందులో ఒకటి ఓవైపు ఒరిగిపోయింది. దీంతో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.

బస్ షెల్టర్ పడిపోయింది.. అది కూడా జగన్ తప్పేనా..?
X

విశాఖలో బస్ షెల్టర్ ఓవైపు ఒరిగిపోయింది. వెంటనే టీడీపీ అనుకూల మీడియా రచ్చ మొదలు పెట్టింది. సోషల్ మీడియా సంగతి చెప్పేదేముంది. బస్ షెల్టర్ కి పోలవరంకు లింకు పెడుతూ కొంతమంది టీడీపీ సానుభూతి పరులు ట్వీట్లు వేస్తున్నారు. బస్ షెల్టర్ కట్టడం చేతకాదు కానీ పోలవరం కడతారంట అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఇంతకీ ఆ బస్ షెల్టర్ అంత ప్రత్యేకమా, లేక అది విశాఖలో ఉండటం వల్ల అంత ప్రత్యేకంగా మారిందా..?

ఇటీవలే విశాఖ పట్నంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో 20 బస్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. వీటి నిర్మాణం కోసం మొత్తం రూ.4 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఒక్కో బస్ షెల్టర్ కోసం సగటున 20 లక్షలు ఖర్చు చేశారన్నమాట. అంత ఖర్చు పెట్టారంటే దాని నిర్మాణం కూడా అదే క్వాలిటీతో ఉండాలి. మంత్రులు, జీవీఎంసీ మేయర్ అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేశారు. కానీ బస్ షెల్టర్లు ప్రారంభించి నెలరోజులు కాకముందే అందులో ఒకటి ఓవైపు ఒరిగిపోయింది. దీంతో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.


ప్రస్తుతం విశాఖలో చీమ చిటుక్కుమన్నా వార్తే. విశాఖకు పాలనా రాజధాని తరలిస్తామంటూ ఓవైపు ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు విశాఖలో నేరాలు పెరిగిపోయాయని, రౌడీ రాజ్యం వచ్చేస్తోందని జనసేన, టీడీపీ విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల విశాఖలో పర్యటించిన పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా బస్ షెల్టర్ కుంగిపోవడం కూడా ఇలాగే హైలైట్ అవుతోంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం ఒక్కటే ఇక్కడ సంతోషించదగ్గ విషయం.


First Published:  27 Aug 2023 10:25 AM GMT
Next Story