Telugu Global
Andhra Pradesh

జగన్ కోసం వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

ఎల్లో మీడియా రోత రాతలు, కూటమి నేతల తప్పుడు ఆరోపణలతో వాలంటీర్లు రగిలిపోతున్నారు. రాజీనామాలు చేసినవారంతా కసిగా టీడీపీ అభ్యర్థుల్ని ఓడించడంకోసం పనిచేయబోతున్నారు.

జగన్ కోసం వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
X

ఏపీలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీతో వారికి సంబంధం లేదంటూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం, వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర డివైజ్ లు వెనక్కి తీసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వాలంటీర్లు. 2 నెలలపాటు వారికి ఎలాంటి పని ఉండదని తేలిపోయింది. పెన్షన్ల పంపిణీకు దూరం పెట్టడంతో ఒకరంగా మానసిక ఒత్తిడికి గురైన వాలంటీర్లంతా ఇప్పుడు రాజీనామా బాట పట్టారు.

వైసీపీ అభ్యర్థుల పక్కన కనపడితే చాలు వాలంటీర్లపై రాజకీయ ముద్ర వేస్తున్నాయి ప్రతిపక్షాలు. వారి పొటోలచుట్టూ వృత్తాలు గీచి మరీ వారిని దొంగలుగా, ద్రోహులుగా ఎల్లోమీడియా చిత్రీకరించడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషన్ కూడా వారిని విధులకు దూరం చేసింది. దీంతో వారంతా రాజీనామాలు చేస్తున్నారు. దాదాపుగా అన్ని చోట్ల వాలంటీర్లు స్వచ్ఛందంగా విధులనుంచి తప్పుకుంటున్నట్టు ఎంపీడీవోలకు రాజీనామా లేఖలు పంపిస్తున్నారు.

ఒకరకంగా వాలంటీర్లతో టీడీపీ కోరి మరీ కయ్యం తెచ్చుకున్నట్టయింది. వారిమానాన వారు పనిచేస్తూ ఇంటికి వెళ్లి మరీ లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తుంటే.. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి మరీ టీడీపీ రెచ్చగొట్టింది. అటు వాలంటీర్లకు పనిలేకుండా చేసి, ఇటు లబ్ధిదారులు పెన్షన్ కోసం సచివాలయాల చుట్టూ తిరిగేలా చేసింది. ఇప్పటికే ఎల్లో మీడియా రోత రాతలు, కూటమి నేతల తప్పుడు ఆరోపణలతో వాలంటీర్లు రగిలిపోతున్నారు. రాజీనామాలు చేసినవారంతా కసిగా టీడీపీ అభ్యర్థుల్ని ఓడించడంకోసం పనిచేయబోతున్నారు.

బొత్స హామీ..

రాజీనామా చేస్తున్న వాలంటీర్ల ఉద్యోగాలు ఎక్కడికీ పోవని వైసీపీ నేతలు హామీలివ్వడం విశేషం. ఏదో ఒక కారణంతో రిజైన్ చేస్తే వాళ్ల అభ్యర్థన పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ఫూల్స్ చేద్దాం అనుకుని చివరకు చంద్రబాబు ఫూల్ అయ్యాడని ఆయన మండిపడ్డారు.

First Published:  1 April 2024 8:59 AM GMT
Next Story