Telugu Global
Andhra Pradesh

జగన్‌ కోసం సిద్ధం.. వైసీపీ కొత్త స్లోగన్‌

ఇవాళ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్‌. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. రాబోయే 10 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

జగన్‌ కోసం సిద్ధం.. వైసీపీ కొత్త స్లోగన్‌
X

పోలింగ్‌కు మరో 10 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది వైసీపీ. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం లాంటి స్లోగన్స్‌తో జనాల్లోకి వెళ్లిన వైసీపీ.. మరో నూత‌న కార్యక్రమానికి శ్రీకారానికి చుట్టింది.

ఇవాల్టి నుంచి జగన్‌ కోసం సిద్ధం పేరుతో ప్రచారం నిర్వహించనున్నారు పార్టీ నేతలు. ఇందులో భాగంగా వైసీపీ మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ క్యాంపెయినర్లు పాల్గొననున్నారు. ఇటీవల 37 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన వైసీపీ.. అందులో 12 మంది సామాన్యులకు చోటు కల్పించింది.

మరోవైపు ఇవాళ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్‌. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. రాబోయే 10 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపటి నుంచి ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నారు జగన్.

First Published:  2 May 2024 7:19 AM GMT
Next Story