Telugu Global
Andhra Pradesh

వైసీపీ దెబ్బకు భోరుమంటున్న ఎల్లో మీడియా

టీడీపీ చేస్తున్న పనే వైసీపీ చేస్తుంటే ఎల్లో మీడియాకు ఏడుపెందుకు? ఇక్కడ సమస్య ఏమిటంటే జగన్‌కు వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో వార్తలు, కథనాలను జనాలు నమ్మటం మానేశారు.

వైసీపీ దెబ్బకు భోరుమంటున్న ఎల్లో మీడియా
X

వైసీపీ దెబ్బకు ఎల్లో మీడియా భోరుమంటోంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫైట్ చేయలేమని చేతులెత్తేసినట్లుంది. ‘కిరాయి సైన్యం’ హెడ్డింగుతో అచ్చేసిన బ్యానర్ కథనమే సాక్ష్యం. ఫేక్ వార్ కోసం వైసీపీ సైబర్ ఆర్మీని ఏర్పాటు చేసుకుంద‌ని భోరున ఏడ్చేసింది. తనకు మద్దతుగా 265 యూ ట్యూబ్ ఛానళ్ళు, 25 న్యూస్ వెబ్‌సైట్లతో ఒప్పందం చేసుకున్నదట. జగన్ అనుకూల, విపక్ష వ్యతిరేక ప్రచారమే టార్గెట్‌గా ఔట్ సోర్సింగ్ ద్వారా 17 వేల మందిని నియమించుకుంద‌ని తెగబాధపడిపోయింది. అయితే ఇక్కడ ఎల్లో మీడియా లెక్క తప్పింది. ఎలాగంటే 17 వేలు కాదు లక్షమందితో ఐటి ఆర్మీ తయారైందని వైసీపీనే ప్రకటించింది.

తన పేరు కనిపించకుండా వైసీపీ ముసుగు సైన్యాన్ని రెడీ చేసుకున్నట్లు బోఫోర్స్ కుంభకోణాన్ని వెలికితీసినంత ఓవరాక్షన్ చేసింది. ఎల్లో మీడియా చెబుతున్నట్లు వైసీపీ రెడీ చేసుకున్నదనే అనుకుంటే ఇందులో తప్పేముందో అర్థ‌కావటం లేదు. ఏ పార్టీ అయినా తనకు పాజిటివ్‌గా ప్రచారం చేసుకునేందుకే కదా ప్రయత్నిస్తుంది? తనను తాను పాజిటివ్‌గా ప్రొజెక్టు చేసుకుంటూనే ప్రత్యర్థులపై వ్యతిరేక ప్రచారం చేయటం తప్పెలాగవుతుంది?

చంద్రబాబునాయుడుకు మద్దతుగా మీడియా ముసుగులో ఎల్లో మీడియా దశాబ్దాలుగా చేస్తున్న పని కూడా ఇదే కదా. టీడీపీకి అనుబంధంగా ఐటీడీపీ దేని కోసం పనిచేస్తోంది? టీడీపీకి మద్దతుగా యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్‌సైట్లు చాలా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ చేస్తున్న పనే వైసీపీ చేస్తుంటే ఎల్లో మీడియాకు ఏడుపెందుకు? ఇక్కడ సమస్య ఏమిటంటే జగన్‌కు వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో వార్తలు, కథనాలను జనాలు నమ్మటం మానేశారు. జగన్‌కు వ్యతిరేకంగా తాము ఎంత ప్రచారం చేసినా జనాలు నమ్మటంలేదన్నదే అసలైన బాధ.

తమ వార్తలను, కథనాలను జనాలు నమ్మటంలేదు కాబట్టి వైసీపీకి అనుకూలంగా వచ్చే వార్తలను కూడా జనాలు నమ్మకూడదని ఎల్లో మీడియా అనుకుంటుంది. అందుకనే వైసీపీకి అనుకూలంగా వచ్చే వార్తలు, కథనాలను నమ్మద్దని జనాలకు చెబుతోంది. అయితే ఎల్లో మీడియా యాజమాన్యం మరచిపోయిన విషయం ఏమిటంటే మీడియా లేదా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను జనాలు నమ్మటం మానేశారు. సోషల్ మీడియాలో వివిధ కోణాల్లో వచ్చే వార్తలను చదివి జనాలు మంచి చెడ్డా తేల్చుకుంటున్నారు. తాము చెప్పని కోణం కూడా జనాలకు చేరుతోందన్నదే ఎల్లో మీడియా అసలైన ఏడుపు.

First Published:  5 July 2023 6:02 AM GMT
Next Story