Telugu Global
Andhra Pradesh

పోలీసులపై పాజిటివ్ స్టోరీలు.. ఎల్లో మీడియా కొత్త గేమ్

అసలు నోటీసులందుకున్నవారిలో నాని అనుచరులు ఉన్నారో లేదో తెలియదు కానీ ఎల్లో మీడియా మాత్రం "శభాష్ పోలీస్.. వైసీపీ అనుచరులకే నోటీసులు.." అంటూ కథనాలు వండి వారుస్తోంది.

పోలీసులపై పాజిటివ్ స్టోరీలు.. ఎల్లో మీడియా కొత్త గేమ్
X

ఇన్నాళ్లూ పోలీసులపై విపరీతమైన వ్యతిరేక భావాన్ని ప్రచారం చేసింది ఎల్లో మీడియా. నారా లోకేష్ అయితే ఏకంగా రెడ్ బుక్ పట్టుకుని తిరిగారు. వాలంటీర్లయినా, సచివాలయ ఉద్యోగులయినా.. అందరూ టీడీపీకిి, ఎల్లోమీడియాకి శత్రువులుగానే కనపడ్డారు. కానీ ఎన్నికల వేళ మాత్రం సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వాలంటీర్లపై విపరీతమైన ప్రేమాభిమానాలను కురిపించారు. ఇప్పుడు పోలీసులపై పాజిటివ్ స్టోరీలతో కొత్త గేమ్ మొదలు పెట్టింది ఎల్లో మీడియా.

మచిలీపట్నం మండలం ఉల్లిపాలెంలో రెండు రోజుల క్రితం నూకాలమ్మ అమ్మవారి జాతర జరిగింది. రెండు వర్గాలు కొట్టుకున్నాయి. వారందర్నీ పిలిపించి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. వారిలో మాజీ మంత్రి పేర్ని నాని అనుచరులు ఉన్నారట. అయితే వారిని కూడా పోలీసులు పిలిపించారని, దీంతో నాని పోలీస్ స్టేషన్ వద్ద గొడవకు వచ్చారని, కానీ పోలీసులు లెక్క చేయలేదనేది ఈనాడు కథనం సారాంశం. ఇప్పుడు నాని అనుచరులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారని అంటున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా 144 సెక్షన్‌ను అతిక్రమించారంటూ కేసు నమోదు చేశారట. ఉద్దేశపూర్వకంగా పీఎస్‌ వద్ద గొడవ సృష్టించారని సెక్షన్‌ 143, సీసీ ఫుటేజ్‌, ఫర్నిచర్‌ ధ్వంసంపై సెక్షన్‌ 427 కింద కేసు రిజిస్టర్‌ అయిందని సమాచారం.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, పోలీసులు వారి డ్యూటీ నిర్వహించారు. అయితే పేర్ని నాని అనుచరులపై కేసు అనేది మాత్రం బాగా హైలైట్ అవుతోంది. అసలు నోటీసులందుకున్నవారిలో నాని అనుచరులు ఉన్నారో లేదో తెలియదు కానీ ఎల్లో మీడియా మాత్రం "శభాష్ పోలీస్.. వైసీపీ అనుచరులకే నోటీసులు.." అంటూ కథనాలు వండి వారుస్తోంది. ఇక్కడ వైసీపీ నేతలపై బురదజల్లుతూనే.. పోలీసులకు ఎక్కడలేని హైప్ ఇవ్వడం విశేషం. ఆ రకంగా ఏపీ పోలీసుల్ని మోసేస్తూ.. కోడ్ అమలులోకి వచ్చాక వారు హీరోలయ్యారని చెబుతూ కొత్త కథ నడుపుతోంది. ఇలాంటి కథనాలతో పోలీసుల్ని మరింతగా రెచ్చగొట్టాలని చూస్తోంది. ఎల్లో మీడియా జోలపాటకు నిద్రపోడానికి పోలీసులు మరీ అంత అమాయకులా..?

First Published:  10 April 2024 12:15 PM GMT
Next Story