Telugu Global
Business

Xiaomi EV Car SU7 | చైనా మార్కెట్‌లో షియోమీ తొలి ఎల‌క్ట్రిక్ కారు ఎస్‌యూ7 ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Xiaomi EV Car SU7 | చైనా టెక్నాల‌జీ సంస్థ షియోమీ (Xiaomi) త‌న తొలి ఎల‌క్ట్రిక్ కారు ఎస్‌యూ7 (SU7) కారును చైనా మార్కెట్లో శుక్ర‌వారం ఆవిష్క‌రించింది.

Xiaomi EV Car SU7 | చైనా మార్కెట్‌లో షియోమీ తొలి ఎల‌క్ట్రిక్ కారు ఎస్‌యూ7 ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!
X

Xiaomi EV Car SU7 | చైనా టెక్నాల‌జీ సంస్థ షియోమీ (Xiaomi) త‌న తొలి ఎల‌క్ట్రిక్ కారు ఎస్‌యూ7 (SU7) కారును చైనా మార్కెట్లో శుక్ర‌వారం ఆవిష్క‌రించింది. ఎల‌న్‌మ‌స్క్ సార‌ధ్యంలోని టెస్లా మోడ‌ల్ 3 (Tesla Model 3)తో పోటీ పడుతుంద‌ని షియోమీ సీఈఓ లీ జున్ పేర్కొన్నారు. మే నెల‌లో చైనా రోడ్ల‌పైకి దూసుకువ‌స్తుంద‌ని చెప్పారు. షియోమీ త‌న ఎల‌క్ట్రిక్ సెడాన్ కారు ఎస్‌యూ7 మూడు వేరియంట్లు (ఎస్‌యూ7, ఎస్‌యూ7 ప్రో, ఎస్‌యూ7 మ్యాక్స్‌)గా వ‌స్తుంది. దీని ధ‌ర సుమారు రూ.25 ల‌క్ష‌లు ఉంటుంద‌ని తెలిపింది. అయితే, భార‌త్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్క‌రిస్తామ‌న్న సంగ‌తి తెలియ‌రాలేదు. చైనా ప్ర‌భుత్వ రంగ ఆటోమొబైల్ కంపెనీ `బీజింగ్ ఆటోమోటివ్ ఇండ‌స్ట్రీ హోల్డింగ్ కంపెనీ (బీఏఐసీ) మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్‌లో షియోమీ ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ కార్లు త‌యారు చేస్తారు. గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో పొర్చే911, బీఎండ‌బ్ల్యూ ఐ4, బీవైడీ సీల్‌, టెస్లా మోడ‌ల్‌3 కార్ల‌తో పోటీ ప‌డుతుంద‌ని తెలిపింది.

షియోమీ ఎస్‌యూ7 : వేరియంట్ల వారీగా ధ‌ర ఇలా

ఎస్‌యూ7 (73.6 కిలోవాట్ల బ్యాట‌రీ) - సింగిల్ చార్జింగ్‌తో 700 కి.మీ ప్ర‌యాణం- రూ.24.90 ల‌క్ష‌లు

ఎస్‌యూ7 ప్రో (94.3కిలోవాట్ల బ్యాట‌రీ) - సింగిల్ చార్జింగ్‌తో 830 కి.మీ ప్ర‌యాణం - రూ.28.36 ల‌క్ష‌లు

ఎస్‌యూ7 మ్యాక్స్ (101కిలోవాట్ల బ్యాట‌రీ) - సింగిల్ చార్జింగ్‌తో 800 కి.మీ ప్ర‌యాణం - రూ.34.59 ల‌క్ష‌లు

ఎల‌క్ట్రిక్ కూపె సెడాన్ ఎస్‌యూ7 కారు అటాన‌మ‌స్ డ్రైవింగ్ టెక్నాల‌జీతో వ‌స్తుండ‌టంతోపాటు షియోమీ హైప‌ర్ ఓఎస్‌తో ప‌ని చేస్తుంది. సెంట్ర‌ల్ కంట్రోల్ డిస్‌ప్లే, త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్‌, బీ-పిల్ల‌ర్ కెమెరా నుంచి ఫేస్ రిక‌గ్నిష‌న్ అన్ లాకింగ్, షియోమీ ఎస్‌యూ7 ఫ్రంట్ డిజైన్ న్యూ మ్యాక్ లారెన్స్ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న‌ది. టెయిల్ లైట్స్‌, లైట్ బార్‌తోపాటు ఈవీ సెడాన్ స్లిమ్ రాప్ ఫీచ‌ర్ల‌తో ఉంటుంది. హ‌య్య‌ర్ వేరియంట‌ల‌లో యాక్టివ్ రేర్ వింగ్ కూడా ఉంటుంది. ఎస్‌యూ7 కారుకు 19 లేదా 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. మూడు క‌ల‌ర్స్‌- ఆక్వా బ్లూ, మిన‌ర‌ల్ గ్రే, వేర్డంట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.


పోర్చే టేక్యాన్ కంటే స్వ‌ల్పంగా పొడ‌వుగా ఉంటుంది. రెండు ప‌వ‌ర్‌ట్రైన్ ఆప్ష‌న్లలో ల‌భిస్తుంది. ఎస్‌యూ7 వేరియంట్ 220 కిలోవాట్ల వీ6 మోటార్ విత్ రేర్ వీల్ డ్రైవ్‌తో వ‌స్తుంది. ఈ మోటార్ గ‌రిష్టంగా 299 పీఎస్ విద్యుత్‌, 400 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కేవ‌లం 5.28 సెక‌న్ల‌లో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. గ‌రిష్టంగా గంట‌కు 210 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది.

సెకండ్ ఆప్ష‌న్‌లో 495 కిలోవాట్ల వీ6ఎస్ డ్య‌య‌ల్ మోటార్ సెట‌ప్ విత్ వీల్ డ్రైవ్ ఆప్ష‌న్‌తో వ‌స్తున్న‌ది. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్ష‌న్ గ‌ల ఈ మోటారు గ‌రిష్టంగా 673 పీఎస్ విద్యుత్ 838 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 2.78 సెక‌న్ల‌లో 100 కి.మీ వేగంతో దూసుకెళ్లే సామ‌ర్థ్యం గ‌ల ఈ కారు గంట‌కు గ‌రిష్టంగా 265 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. 4 పిస్ట‌న్ కాలిపర్స్‌తో కూడిన టాప్ లెవ‌ల్ బ్రేకింగ్ సిస్ట‌మ్‌తో వ‌స్తున్న‌ది. బోచ్ డీపీబీ బ్రేక్ కంట్రోల‌ర్‌, బోచ్ ఈఎస్పీ 10.0 స్టెబిలిటీ కంట్రోల్ సిస్ట‌మ్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి. ఎంట్రీ లెవ‌ల్ వేరియంట్‌ 73.6 కిలోవాట్ల లిథియం ఐర‌న్ పాస్పేట్ బ్యాట‌రీ ఉండ‌టంతోపాటు పూర్తి చార్జింగ్‌తో 668 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. టాప్ వేరియంట్ 101 కిలోవాట్ల సీఏటీఎల్ సెల్ టు బాడీ (సీటీబీ) బ్యాట‌రీ ప్యాక్‌తో వ‌స్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 800 కి.మీ ప్ర‌యాణిస్తుంది. త‌దుప‌రి ఎస్‌యూ7లోని న్యూవీ8 వేరియంట్‌లో 150 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్ ఉంటుంది. రెండు వేరియంట్ల‌కూ 800 వోల్ట్ హైప‌ర్ చార్జ‌ర్ అందిస్తారు. ఈ చార్జ‌ర్ సాయంతో ఐదు నిమిషాలు చార్జింగ్‌తో 220 కి.మీ, 15 నిమిషాల చార్జింగ్‌తో 510 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది.

ఎస్‌యూ7 కారులో రెండు థీమ్ ఇంటీరియ‌ర్ డిజైన్లు ఉంటాయి. 16.1 అంగుళాల సెంట్ర‌ల్ కంట్రోల్ స్క్రీన్ విత్ 3కే రిజొల్యూష‌న్‌, రేర్ ప్యాసింజ‌ర్ల‌కు డాష్‌బోర్డుపై రెండు స్మాల్ 7.1 అంగుళాల ఎల్‌సీడీలు ల‌భిస్తాయి. హైప‌ర్ ఓఎస్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8295 ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుందీ కారు. 2025లో ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ కారును మార్కెట్లో ఆవిష్క‌రించనున్న‌ది.

First Published:  30 March 2024 2:29 AM GMT
Next Story