Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా రెడీ చేసిన ఆది సాయికుమార్

ఆది సాయికుమార్ నుంచి మరో సినిమా రెడీ అయింది. సినిమా పేరు సీఎస్ఐ సనాతన్. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

మరో సినిమా రెడీ చేసిన ఆది సాయికుమార్
X

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేయడం ఆది సాయికుమార్ స్పెషాలిటీ. సగటున 3 నెలలకు ఓ సినిమా, ఆది సాయికుమార్ నుంచి వస్తుంది. ఓ సినిమా ఇలా వెళ్లడం, మరో సినిమా ఇలా రావడం చకచకా జరిగిపోతాయి. ప్రేక్షకులు కూడా గ్రహించలేనంత ఫాస్ట్ గా జరిగిపోతుంది ఈ వ్యవహారం. ఇప్పుడిదంతా ఎందుకంటే, ఆది సాయికుమార్ నుంచి మరో సినిమా రెడీ అయింది. దీని పేరు సీఎస్ఐ సనాతన్.

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సీఎస్ఐ సనాతన్". ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ఐ) ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న "సీఎస్ఐ సనాతన్" సినిమా గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు.

ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. హత్య కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ మూడ్ లో కనిపిస్తున్నాడు. క్రైమ్ సీన్ లో దొరికిన ప్రతి చిన్న అంశాన్నీ రిపోర్టులో చేరుస్తూ నివేదిక తయారు చేస్తున్నాడు.

ఎలాంటి నేరాన్నైనా ఛేదించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ పాత్ర రూపొందింది. ఈ క్లూస్ తో నేరస్థులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఇప్పటిదాకా రాని సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మిషా నారంగ్, అలీ రెజా, నందినీ రాయ్ ఇతర పాత్రలు పోషించారు.



First Published:  28 Sep 2022 4:04 AM GMT
Next Story