Telugu Global
Cinema & Entertainment

Actress Laila - మరో కీలక పాత్రలో లైలా

Actress Laila - మరో కీలక పాత్రలో మెరవనుంది లైలా. ఆది పినిశెట్టి సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం.

Actress Laila - మరో కీలక పాత్రలో లైలా
X

ఆది పినిశెట్టి మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'వైశాలి' సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అరివళగన్‌తో కలసి ఆది పినిశెట్టి చేస్తున్న చిత్రం 'శబ్దం'. 7జీ ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లక్ష్మి మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ లైలా కీలక పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందులో మునుపెన్నడూ చూడని పాత్రలో లైలా కనిపించబోతోందట.

తన పాత్రకు వెయిట్ ఉండే క్యారెక్టర్స్ మాత్రమే చేస్తోంది లైలా. తాజాగా సర్దార్ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అలాంటిదే మరో పవర్ ఫుల్ పాత్రలో శబ్దం సినిమాలో కనిపించనుంది.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా నుంచి ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారు.

First Published:  11 March 2023 2:25 AM GMT
Next Story