Telugu Global
Cinema & Entertainment

Trisha | ఈ ఫొటోలేంటి.. ప్రమోషన్ కోసమా.. పెళ్లి కోసమా..?

Trisha Marriage - త్రిష పెళ్లిపై మరోసారి పుకార్లు మొదలయ్యాయి. ఈసారి ఆమె పెళ్లిపై ఊహాగానాలు చెలరేగడానికి కారణం ఏంటి?

Trisha | ఈ ఫొటోలేంటి.. ప్రమోషన్ కోసమా.. పెళ్లి కోసమా..?
X

ఉన్నట్టుండి సడెన్ గా సంప్రదాయబద్దంగా మారింది త్రిష. వరుసపెట్టి చీరకట్టుతో ఫొటోలు విడుదల చేస్తోంది. దీంతో ఆమె పెళ్లిపై మరోసారి పుకార్లు మొదలయ్యాయి. ఈ ఏడాది త్రిష కచ్చితంగా తన పెళ్లి కబురు ప్రకటిస్తుందంటున్నారు ఆమె అభిమానులు.

40 ఏళ్ల త్రిషపై పెళ్లి పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు. ఆమె లైఫ్ లో పెళ్లికి సంబంధించిన విశేషాలు, డేటింగ్ మేటర్స్ చాలానే ఉన్నాయి. అయితే ఇంతవరకు ఆమె పెళ్లిపీటలు ఎక్కలేదు. ఆమె లవ్ ఎఫైర్స్ ఫలించలేదు.

మొన్నటికిమొన్న దుబాయ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిష పెళ్లి అంటూ కోలీవుడ్ జోరుగా ప్రచారం నడిచింది. దీనికి సంబంధించి త్రిష తల్లి కూడా పరోక్షంగా స్పందించింది. అయితే ఆ తర్వాత ఆ పెళ్లి మేటర్ ఏమైందో ఎవ్వరికీ తెలియదు.

మళ్లీ ఇన్నాళ్లకు త్రిష పెళ్లిపై పుకార్లు వస్తున్నాయి. ఆమె తన పెళ్లి విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తుందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం, తనకు ఎంతో ఇష్టమైన జయలలితను ఆదర్శంగా తీసుకొని, బ్యాచిలర్ గా ఉండిపోతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీగా ఉంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్ సరసన మరోసారి నటిస్తోంది. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ తో మరో హిట్ కొట్టింది. తమిళ్ లో ఆమె చేతిలో 4 సినిమాలున్నాయి. ఇన్నేళ్లయినా ఆమె అందం తగ్గలేదు, అవకాశాలు కూడా తగ్గలేదు.

First Published:  20 Aug 2023 4:17 PM GMT
Next Story