Telugu Global
Cinema & Entertainment

Geethanjali | 'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ రెడీ

Geethanjali - అంజలి నటించిన 50వ చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సినిమా గురించి అంజలి ప్రత్యేకంగా మాట్లాడింది

Geethanjali | గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ రెడీ
X

అంజలి నటించిన 'గీతాంజలి' ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం "గీతాంజలి మళ్లీ వచ్చింది" చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శతక్వంలో ఎంవీవీ సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. అంజలికి ఇది 50వ చిత్రం. దీంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకంగా మారింది.

హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అంజలి ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడింది.

"గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ చాలా బాగా వచ్చింది. సినిమా దీని కంటే వంద రెట్లు బాగుంటుంది. నా 50వ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండాలని అనుకున్నాను. ఆ కోరిక గీతాంజలి మళ్ళీ వచ్చిందితో తీరింది. నా ఎంటైర్ టీమ్ మనసు పెట్టి ఈ మూవీ చేశారు. అందరూ ఎంటర్ టైన్ కావాలనే ఉద్దేశంతోనే సినిమా చేశాం. స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించాం. త్వరలోనే దాన్ని రిలీజ్ చేస్తాం. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్ అవుతుంది. కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి చేసిన సినిమా.’’

అంజలి లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.

First Published:  4 April 2024 4:52 PM GMT
Next Story