Telugu Global
Cinema & Entertainment

హెబ్బా పటేల్ నుంచి వరుసగా మరో సినిమా

హెబ్బా పటేల్ నుంచి నెల రోజుల గ్యాప్ లో మరో సినిమా రాబోతోంది. ఈసారి కూడా ఆమె డీ-గ్లామర్ రోల్ లోనే కనిపించనుంది.

హెబ్బా పటేల్ నుంచి వరుసగా మరో సినిమా
X

హీరోయిన్ హెబ్బా పటేల్ నుంచి వరుసపెట్టి సినిమాలొస్తున్నాయి. గత వారం ఆమె నుంచి గీత సినిమా వచ్చింది. అందులో మూగమ్మాయిగా నటించింది. సినిమాకు పాజిటివ్ రిజల్ట్ రాకపోయినా, హెబ్బా యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి.

ఇప్పుడీ హీరోయిన్ నుంచి మరో సినిమా రెడీ అయింది. ఇది కూడా డిఫరెంట్ మూవీనే. ఈ సినిమా పేరు 'తెలిసినవాళ్లు'. ఈ సినిమాలో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడే అమ్మాయిగా నటించింది హెబ్బా పటేల్. దాదాపుగా ఇది కూడా డీ-గ్లామర్ పాత్రే. ఇప్పుడీ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

సిరెంజ్ సినిమా బ్యానర్ పై విప్లవ్ కోనేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా "తెలిసినవాళ్ళు". విభిన్న కథాంశంతో రొమాన్స్ – ఫ్యామిలీ – థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా అతని సరసన హీరోయిన్ పాత్రలో హెబ్బా పటేల్ నటించింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. టీజర్ చూసిన తరువాత సినిమాపై అంచనాలు పెరిగాయి. వచ్చే నెలలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. అలా హెబ్బా నుంచి నెల రోజు గ్యాప్ లో 2 సినిమాలు వస్తున్నాయన్నమాట.

First Published:  18 Oct 2022 3:19 AM GMT
Next Story