Telugu Global
Cinema & Entertainment

Ambajipeta | తెలుగు తెరపైకి మరో శివానీ

Ambajipeta | అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో మరో శివానీ టాలీవుడ్ కు పరిచయం అవ్వబోతోంది. ఇంతకీ ఎవరామె?

Ambajipeta | తెలుగు తెరపైకి మరో శివానీ
X

సుహాస్ హీరోగా నటించిన సినిమా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. ఈ సినిమాతో శివానీ నాగరం హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఇంతకీ ఆమెకు ఈ అవకాశం ఎలా వచ్చింది..?

"ఈ సినిమాలో అవకాశం నాకు ఆడిషన్ ద్వారానే వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పంపారు. నేను హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ అని వెళ్లాను. అయితే ఆడిషన్ తీసుకున్న తర్వాత హీరోయిన్ గానే తీసుకుంటున్నాం అని చెప్పారు. ఫస్ట్ డే షూట్ చేసే వరకు నేనే హీరోయిన్ అనేది నమ్మలేకపోయాను."

ఇలా తను హీరోయిన్ గా మారిన విషయాన్ని వెల్లడించింది శివానీ. ఈ ముద్దుగుమ్మది హైదరాబాద్. పుట్టిపెరిగింది హైదరాబాద్ లోనే. తొలిసారి ఈ సినిమా కోసం హైదరాబాద్ దాటి మరో ఊరు వెళ్లిందట. అలా అమలాపురం, అంబాజీపేట ఊళ్లలో 75 రోజుల పాటు ఉండి షూటింగ్ చేసిందట.

హైదరాబాద్ పిల్లకు అంబాజీపేట యాస వస్తుందా? దీనికి కూడా సమాధానం చెప్పింది శివానీ. సినిమాలో తన పాత్రకు ప్రత్యేకంగా యాస ఉండదని స్పష్టం చేసింది. 2-3 చోట్ల మాత్రం యాస కనిపించేలా డైలాగ్స్ ఉన్నాయని, వాటిని దర్శకుడు చెప్పినట్టు చేశానని వెల్లడించింది. ఈమె క్లాసికల్ డాన్సర్ కూడా.

First Published:  29 Jan 2024 5:08 PM GMT
Next Story