Telugu Global
Cinema & Entertainment

BAAK Movie | బాక్ మూవీ సెన్సార్ టాక్

BAAK Movie Censor - రాశిఖన్నా, తమన్న హీరోయిన్లుగా నటించిన సినిమా బాక్.

BAAK Movie | బాక్ మూవీ సెన్సార్ టాక్
X

సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా బాక్. అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాలుగో సీక్వెల్ గా వస్తోంది బాక్.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మే 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'పంచుకో' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అవ్నీ సినిమాక్స్ బ్యానర్ పై ఖుష్బూ సుందర్ ఈ సినిమాను నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు, స్వయంగా తనే దర్శకత్వం వహించాడు సుందర్. వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాకు ముందు వచ్చిన అరణ్మనై-3 సినిమాను తెలుగులో అంతఃపురం పేరిట విడుదల చేశారు. దానికి ఓటీటీలో, టీవీల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి వస్తున్న పార్ట్-4 మాత్రం థియేటర్లలో కూడా హిట్టవుతుందని అంటున్నారు మేకర్స్.

First Published:  28 April 2024 8:04 AM GMT
Next Story