Telugu Global
Cinema & Entertainment

Baak Movie | తమన్నా, రాశి ఖన్నా గ్లామర్ షో

Baak Movie - బాక్ మూవీ నుంచి ప్రచార గీతం రిలీజైంది. రాశిఖన్నా, తమన్న తమ అందాలతో అదరగొట్టారు.

Baak Movie | తమన్నా, రాశి ఖన్నా గ్లామర్ షో
X

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాలుగో చిత్రం అరణ్మనై-4, తెలుగులో బాక్ పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్. మేకర్స్ ఇటీవల అన్ని ప్రధాన పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేయడం ద్వారా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈరోజు 'పంచుకో'అనే ప్రోమో సాంగ్ తో వచ్చారు.

హిపాప్ తమిళ మంచి బీట్ తో ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు. సాహితీ లిరిక్స్ రాస్తే, రాఘవి హస్కీ వాయిస్ మెస్మరైజ్ చేస్తోంది. తమన్నా, రాశీఖన్నాల గ్లామర్‌ ఈ పాటను మరింత అందంగా మార్చింది. వారి డాన్స్, మరీ ముఖ్యంగా హిప్ మూమెంట్స్ చూడ్డానికి బాగున్నాయి. ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, హీరోయిన్లిద్దరూ అదరగొట్టారు. ప్రోమో సాంగ్‌లో సినిమాలోని కొన్ని ఎక్సయిటింగ్ సన్నివేశాలను కూడా చూపించారు.

అవ్నీ సినిమాక్స్ బ్యానర్ పై సుందర్ సి భార్య ఖుష్బూ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఏప్రిల్ 26న 'బాక్ 'ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

First Published:  14 April 2024 3:57 PM GMT
Next Story