Telugu Global
Cinema & Entertainment

Veera Simha Reddy Movie: ఫైనల్ షెడ్యూల్ లోకి బాలయ్య సినిమా

Veera Simha Reddy Movie Update: బాలయ్య తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాకు ఫైనల్ షెడ్యూల్ లాక్ చేశారు.

Veera Simha Reddy Movie: ఫైనల్ షెడ్యూల్ లోకి బాలయ్య సినిమా
X

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కు చేరుకుంది. ఇప్పటికే టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి 21వ తేదీ నుంచి ఫైనల్ షెడ్యూల్ మొదలుకాబోతోంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య, శృతిహాసన్ పై ఓ సాంగ్ తీయబోతున్నారు.

ఈ ఫైనల్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లోనే 3 రోజుల పాటు బాలయ్య-శృతిహాసన్ పై సాంగ్ షూట్ చేయబోతున్నారు. ప్రస్తుతం శృతిహాసన్, ఫ్రాన్స్ లో ఉంది. చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఆ షెడ్యూల్ ముగించుకొని, ఇలా బాలయ్య సినిమా సెట్స్ పైకి జాయిన్ కాబోతోంది శృతిహాసన్.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య-తమన్ ది సూపర్ హిట్ కాంబో అనే విషయం తెలిసిందే.

ఇక బ్యాలెన్స్ సాంగ్ విషయానికొస్తే.. దీన్ని ఫోక్ స్టయిల్ లో కంపోజ్ చేశాడు తమన్. బాలయ్య తన ప్రతి సినిమాలో ఓ ఫోస్ స్టయిల్ సాంగ్ పెడతాడనే సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డిలో కూడా అలాంటి సాంగ్ ఉంది. ఆ పాట షూటింగ్ నే 21వ తేదీ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు.

First Published:  19 Dec 2022 7:30 AM GMT
Next Story