Telugu Global
Cinema & Entertainment

Bharateeyudu 2 | వేగంగా రెడీ అవుతున్న భారతీయుడు

Bharateeyudu 2 - కమల్-శంకర్ కాంబోలో వస్తున్న భారతీయుడు సినిమాపై భారీ అంచనాలుకున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ట్రయిలర్ రెడీ అవుతోంది.

Bharateeyudu 2 | వేగంగా రెడీ అవుతున్న భారతీయుడు
X

క‌మ‌ల్ హాస‌న్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘భార‌తీయుడు 2’.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాయ చేయ‌బోతోంది. ఈ సినిమా కోసం సౌత్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ తిరుగులేని విజ‌యాన్ని సాధించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భార‌తీయుడు 2’ రానుండ‌టంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. గ్రిప్పింగ్ క‌థ‌నంతో ఈ మూవీ మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది.

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మే నెలాఖ‌రున ప‌వ‌ర్‌ప్యాక్డ్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూన్‌లో ఈ చిత్రాన్ని ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

‘భార‌తీయుడు 2’ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి, మూవీ ఎలా ఉండ‌బోతుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో ‘జీరో టాల‌రెన్స్‌’ లైన్ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ రూపొందిస్తోన్న ‘భార‌తీయుడు 2’ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. జూన్‌లో ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది ఈ మూవీ.

First Published:  14 April 2024 3:39 PM GMT
Next Story