Telugu Global
Cinema & Entertainment

Bhavanam | సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి మరో మూవీ

Bhavanam Movie - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై లాంగ్ గ్యాప్ తర్వాత మరో మూవీ రెడీ అయింది. దీని పేరు భవనమ్.

Bhavanam | సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి మరో మూవీ
X

అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్. షార్ట్ గ్యాప్ తర్వాత ఈ బ్యానర్ మరోసారి తెరపైకొచ్చింది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రల్లో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించింది.

ఈ సినిమా పేరు 'భవనమ్'. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా 'భవనమ్' ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ , బిత్తిరి సత్తి, అజయ్ ఇలా ప్రధాన తారాగణం అంతా కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో పెద్ద 'భవనమ్' కనిపిస్తోంది.

'ది హాంటెడ్ హౌస్‌' అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ చిత్రం టీజర్ సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్ తో పాటు హ్యుమర్, ఫన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఎక్సయిటింగ్ కంటెంట్ తో ఈ సినిమాని తీర్చిదిద్దారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. సమ్మర్ స్పెషల్ గా మే లో ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

First Published:  6 April 2024 9:27 AM GMT
Next Story