Telugu Global
Cinema & Entertainment

Bichagadu 2 Box Office Collections: మొదటి రోజు మెరిసిన బిచ్చగాడు

Bichagadu 2 Box Office Collections: బిచ్చగాడు మొదటి రోజు మెరిశాడు. ఏకంగా4 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాడు.

Bichagadu 2 Box Office Collections: మొదటి రోజు మెరిసిన బిచ్చగాడు
X

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమా బిచ్చగాడు-2. బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ ఇది. ఏడేళ్ల కిందటొచ్చినప్పటికీ బిచ్చగాడు ఫ్రాంచైజీకి ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని, ఈ సీక్వెల్ నిరూపించింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు బిచ్చగాడు 2 సినిమాకు ఏకంగా నాలుగున్నర కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. సమంత చేసిన శాకుంతలం, నాగచైతన్య ఇటీవల నటించిన కస్టడీ సినిమాల మొదటి రోజు వసూళ్ల కంటే ఇది చాలా ఎక్కువ.

ఇక నైజాంలో ఈ సినిమా ఊహించని వసూళ్లు అందుకుంది. ఒక్క రోజులోనే 65 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ మధ్యకాలంలో ఇంత షేర్ ఎప్పుడూ రాలేదు.

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమాలో కావ్యథాపన్ హీరోయిన్ గా చేసింది. స్వీయ దర్శకత్వంలో నటించడమే కాకుండా, ఈ సినిమాను విజయ్ ఆంటోనీ నిర్మించాడు కూడా. తెలుగులో ఈ సినిమాకు అంతంతమాత్రంగానే ప్రచారం చేశారు. రిలీజ్ కు 3 రోజుల ముందు మాత్రమే హడావుడి చేశారు.

అయినప్పటికీ బిచ్చగాడు-2 సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. తమిళనాడు కంటే తెలుగులో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

First Published:  20 May 2023 11:46 AM GMT
Next Story