Telugu Global
Cinema & Entertainment

Bichagadu 2 Box office Collections: బిచ్చగాడు-2 మొదటి వారాంతం వసూళ్లు

Bichagadu 2 first weekend Box office Collections: బిచ్చగాడు-2 (Bichagadu 2) మొదటి వారాంతం మెరిసింది. 9 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది.

Bichagadu 2 Box office Collections: బిచ్చగాడు-2 మొదటి వారాంతం వసూళ్లు
X

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు-2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంది. మొదటివారాంతం పూర్తయ్యే సరికి ఈ సినిమాకు 9 కోట్ల 52 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈమధ్య తెలుగులో వచ్చిన కొన్ని పెద్ద సినిమాల కంటే, ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి.

రిలీజైన తొలి రోజు ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఆ తర్వాత సినిమా ఊపందుకుంది. మౌత్ పబ్లిసిటీ పాజిటివ్ గా ఉండడంతో, రివ్యూస్ నెగెటివ్ గా ఉన్నప్పటికీ సినిమా నిలబడింది. అలా మొదటిరోజు 4 కోట్లు, రెండో రోజు 3 కోట్లు, మూడో రోజు రెండున్నర కోట్ల రూపాయల గ్రాస్ తో ఈ సినిమా సక్సెస్ అయింది.

ఈ సినిమాకు అన్నీతానై వ్యవహరించాడు విజయ్ ఆంటోనీ. హీరోగా నటించడంతో పాటు.. తనే దర్శకత్వం వహించాడు. కథ, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు కూడా తనే చూసుకున్నాడు. వీటితో పాటు తన సొంత డబ్బులు పెట్టి తనే స్వయంగా సినిమాను నిర్మించాడు కూడా. ఇంత రిస్క్ చేసినందుకు ఇప్పుడు మంచి ఫలితాన్నందుకున్నాడు ఈ హీరో.

బిచ్చగాడు-2 హిట్టయిన ఆనందంలో వెంటనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించాడు విజయ్ ఆంటోనీ. 2025లో బిచ్చగాడు-3 వస్తుందని తెలిపాడు.

First Published:  22 May 2023 10:58 AM GMT
Next Story