Telugu Global
Cinema & Entertainment

Captain Miller | ధనుష్ సినిమా ఫ్లాప్

Captain Miller - తమిళ్ లో సూపర్ హిట్టయిన కెప్టెన్ మిల్లర్ సినిమా, తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది. ధనుష్ ఇందులో హీరో.

Captain Miller Movie Review: కెప్టెన్ మిల్లర్ -రివ్యూ! {2.5/5}
X

కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ పెద్ద పరాజయం పాలైంది. ధనుష్ తాజా పీరియాడిక్ యాక్షన్ డ్రామా, కెప్టెన్ మిల్లర్ తమిళంలో మంచి విజయం సాధించింది, అయితే అయాలాన్, కెప్టెన్ మిల్లర్ కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టి పొంగల్ విజేతగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి ప్రదర్శనను కనబరుస్తుందని భావించారు. కానీ కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ పెద్ద పరాజయం పాలైంది.

సినిమాకు రన్‌టైమ్ సమస్యలు ఉన్నందున, తెలుగు డిస్ట్రిబ్యూటర్లు రన్‌టైమ్‌ను ట్రిమ్ చేసి కొంచెం క్రిస్పీగా మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో జనవరి 26న విడుదలైన ఈ సినిమా, అదే సమయంలో అయాలాన్ కూడా విడుదల చేయాలని భావించారు, అయితే కొన్ని ఫైనాన్స్ సమస్యల కారణంగా అయలాన్ వాయిదా పడింది. దీంతో కెప్టెన్ మిల్లర్ కు మరింత స్కోప్ దక్కింది. భారీ సంఖ్యలో థియేటర్లు దక్కాయి. కానీ ఈ సినిమా ఆ అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది.

నిజానికి ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. మంచి వసూళ్లు వచ్చాయి. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందని ట్రేడ్ భావించింది. కానీ అలా జరగలేదు. రిపబ్లిక్ డే హాలిడే అడ్వాంటేజ్‌తో ఓపెనింగ్ రోజున, ఇది కోటి రూపాయలగ్రాస్ తో డీసెంట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత వెంటనే సినిమా చతికిలపడింది. రెండో రోజుకే క్రాష్ అయింది.

First Published:  29 Jan 2024 5:12 PM GMT
Next Story