Telugu Global
Cinema & Entertainment

Captain Miller | ధనుష్ సినిమాకు లైన్ క్లియర్

Captain Miller - ధనుష్ హీరోగా నటించిన సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. తాజాగా సెన్సార్ పూర్తయింది.

Captain Miller | ధనుష్ సినిమాకు లైన్ క్లియర్
X

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుంది. సెన్సార్ బోర్డ్ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సంక్రాంతి సెలవులు ఈ చిత్రానికి కలిసిరానున్నాయి.

కెప్టెన్ మిల్లర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై టి.జి. త్యాగరాజన్ నిర్మించారు.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా మొదటి 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టీజర్ కూడా సంచలనం సృష్టించింది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ కిషన్ , డాక్టర్ శివ రాజ్ కుమార్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనున్నారు.

బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. నాగూరన్ ఎడిటర్. ‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

First Published:  30 Dec 2023 3:59 PM GMT
Next Story