Telugu Global
Cinema & Entertainment

Vishwambhara | చిరంజీవి సినిమా షూటింగ్ అప్ డేట్స్

Chiranjeevi Vishwambhara - 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంతో విశ్వంభర సినిమా కోసం సెట్ వేశారు. ఇందులో ఇంటర్వెల్ బ్లాక్ షూట్ చేశారు

Vishwambhara | చిరంజీవి సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ కథాంశంతో, భారీ వీఎఫ్‌ఎక్స్‌తో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. దీని కోసం 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంతో కూడిన సెట్ ను వేశారు. తాజాగా ఈ సెట్ లోనే చిరంజీవి, పవన్ కలుసుకున్నారు కూడా.

ఇప్పుడీ సెట్ లో చిరంజీవిపై భారీ యాక్షన్ సీన్ తీస్తున్నారు. రామ్-లక్ష్మణ్ అధ్వర్యంలో ఈ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారు. ఇంటర్వెల్ కార్డు పడ్డానికి ముందు ఈ ఫైట్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 26 వర్కింగ్ డేస్‌ కష్టపడింది యూనిట్. మెగాస్టార్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని వర్కింగ్ డేస్ కేటాయించడం ఇదే తొలిసారి. ఈ సీక్వెన్స్ షూటింగ్ నేటితో పూర్తయింది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్ వెండితెరపై విజువల్ ఫీస్ట్ అంటున్నారు.

విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.

First Published:  22 April 2024 5:11 PM GMT
Next Story