Telugu Global
Cinema & Entertainment

క్రేజీ ఫెలో.. ఒకేసారి టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా

ఆది సాయికుమార్ మరో సినిమా రెడీ చేశాడు. ఇన్నాళ్లూ కాన్సెప్ట్ సినిమాలు చేసిన ఈ హీరో, ఇప్పుడు మళ్లీ పాత ఫార్మాట్ లోకి వచ్చాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేశాడు. ఆ సినిమా పేరు క్రేజీ ఫెలో. టీజర్ రిలీజైంది చూడండి.

క్రేజీ ఫెలో.. ఒకేసారి టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా
X

ఆది సాయికుమార్ మరో సినిమా రెడీ చేశాడు. ఈసారి క్రేజీ ఫెలోగా ముస్తాబయ్యాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన సినిమా ఇది. దీన్నొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చెబుతున్నాడు నిర్మాత.

ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదలైంది. 'క్రేజీ ఫెలో' టైటిల్ కి తగ్గట్టే టీజర్ లో హీరో ఆది పాత్ర చాలా క్రేజీగా ఉంది. ఆది హ్యాపీ లైఫ్ అని గడుపుతుంటాడు. అతను చేసే పనులు తనకు కావాల్సిన వారికి ఇబ్బందులను కలిగిస్తాయి. అతను కుటుంబానికి భారం. స్నేహితులకు, అమ్మాయిలకు ట్రబుల్ మేకర్. అతని జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు - దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ వస్తారు. క్రేజీ ఫెలోగా ఆది క్యారెక్టర్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అనే విషయం టీజర్ చూస్తే తెలుస్తోంది.

టీజర్ లో ఆది కామిక్ టైమింగ్ బాగుంది. సతీష్ ముత్యాల కెమెరా పనితనం, ధృవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. అక్టోబర్ 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు టీజర్ ద్వారా ప్రకటించారు నిర్మాతలు.



First Published:  1 Sep 2022 12:25 PM GMT
Next Story