Telugu Global
Cinema & Entertainment

Devara | సంక్రాంతికి దేవర సందడి

Devara - ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. సంక్రాంతి సినిమాలతో పాటు దేవర సినిమా గ్లింప్స్ సందడి చేయనుంది.

Devara | సంక్రాంతికి దేవర సందడి
X

ఎన్టీఆర్, కొరటాల పాన్ ఇండియన్ మూవీ దేవర. ఈ సినిమా గ్లింప్స్ రెడీ అయింది. దేవర గ్లింప్స్ జనవరి రెండవ వారంలో వస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలతో దీన్ని ప్రదర్శించబోతున్నారు. నిజానికి ఈ నెల్లోనే గ్లింప్స్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే వారానికి వాయిదా వేశారు.

ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అధికారికంగా విడుదలైన టైటిల్, డైలాగ్‌లు బాగా వైరల్ అయ్యాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2 భాగాలుగా తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఎన్టీఆర్, తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దేవర-1ను ఏప్రిల్ 5న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. భారీ వీకెండ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

ఈ సినిమాతో జాన్వి కపూర్ టాలీవుడ్ కు పరిచయమౌతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఆచార్య తర్వాత కొరటాల చేస్తున్న సినిమా ఇదే.

First Published:  24 Dec 2023 3:51 PM GMT
Next Story