Telugu Global
Cinema & Entertainment

Devara Movie - విలన్ తో కలిసిన దేవర

Devara Movie - దుబాయ్ ట్రిప్ పూర్తి చేశాడు ఎన్టీఆర్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దేవర సినిమా షూట్ లో జాయిన్ అయ్యాడు

Devara Movie - విలన్ తో కలిసిన దేవర
X

ఎన్టీఆర్ మళ్లీ సెట్స్‌పైకి వచ్చాడు. కుటుంబంతో కలిసి దుబాయ్ వెకేషన్ కు వెళ్లిన ఎన్టీఆర్, వార రోజుల పాటు అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. ఈమధ్యే హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడు దేవర సినిమా స్టార్ట్ చేశాడు.

“దేవర” రెగ్యులర్ షూటింగ్ మార్చిలో స్టార్ట్ అయింది. అప్పట్నుంచి ఈ సినిమా షూట్ నడుస్తూనే ఉంది. గత నెలలో ఎండ తీవ్రత కారణంగా చిన్న విరామం ఇచ్చారు. అదొక్కటి తప్ప, “దేవర” చిత్రీకరణ అనుకున్న ప్రకారం సాగుతోంది.

ఇక తాజాగా మొదలైన మూడో షెడ్యూల్ చాలా పెద్దది. అంతేకాదు, కీలకమైనది కూడా. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం భారీ యాక్షన్‌ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్‌ పాల్గొంటున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

ఎన్టీఆర్-సైఫ్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాల్ని 20 రోజుల పాటు షూట్ చేయబోతున్నారు. తీర ప్రాంత దీవుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే విషయం తెలిసిందే. దేవర అనే టైటిల్ రోల్ లో ఎన్టీఆర్ నటిస్తుండగా, అతడి ప్రేయసిగా జాన్వి కపూర్ కనిపించనుంది.

First Published:  9 Jun 2023 10:17 AM GMT
Next Story