Telugu Global
Cinema & Entertainment

Ustaad Bhagat Singh - పవన్ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్

Ustaad Bhagat Singh - దేవిశ్రీ ప్రసాద్, హరీశ్ శంకర్ మరోసారి కలిశారు. ఉస్తాద్ కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు.

Ustaad Bhagat Singh - పవన్ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్
X

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరో మాస్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైంది. 10 రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ కి సంబంధించిన ఎడిటింగ్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఇక తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్ కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. సంచలన వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది. 'గబ్బర్ సింగ్' విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలోని ప్రతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. చిత్రంలోని పాటలు దశాబ్దం తరువాత కూడా నేటికీ మారుమ్రోగుతూ ప్రేక్షకులు కాలు కదిపేలా చేస్తున్నాయి. అలాంటి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు ఈ త్రయం.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు, తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ షెడ్యూల్ ముగిసిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది.

First Published:  1 May 2023 5:19 AM GMT
Next Story