Telugu Global
Cinema & Entertainment

Extra Ordinary Man | తన కెరీర్ బెస్ట్ అంటున్న నితిన్

Extra Ordinary Man Trailer Review | ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ ట్రయిలర్ రిలీజైంది. ఈ సినిమాపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు నితిన్.

Extra Ordinary Man | తన కెరీర్ బెస్ట్ అంటున్న నితిన్
X

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా నితిన్ మాట్లాడాడు. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో పాత్రను తన కెరీర్ బెస్ట్ గా చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో తను నాన్-స్టాప్ గా నవ్విస్తానని అంటున్నాడు.

"నటుడిగా నా 21 ఏళ్ల కెరీర్‌లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ నా 32వ సినిమా. నేను చేసిన బెస్ట్ క్యారెక్టరైజేషన్ మూవీస్‌లో ఇది నెంబర్ వన్ అవుతుంది. వక్కంతం వంశీ రాసిన కిక్, రేసుగుర్రం, టెంపర్ సినిమాలన్నీ బావుంటాయి. వాటిన్నంటికీ తగ్గకుండా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ఉంటుంది. డిసెంబర్ 8న మూవీ రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయటమే ఈ మూవీ గోల్. నాన్ స్టాప్‌గా అందరినీ నవ్విస్తాం. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంటుంది. మంచి కథ, పాటలు కూడా ఉంటాయి. అలాగే మంచి డాన్స్ కూడా ఉంటుంది. బాగా డాన్స్ చేసి చాలా కాలమవుతుంది."

ఇలా సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు నితిన్. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హారిశ్ జైరాజ్ సంగీతం అందించాడు. ఇప్పటికే 2 పాటలు పెద్ద హిట్టయ్యాయి.

First Published:  28 Nov 2023 2:00 AM GMT
Next Story