Telugu Global
Cinema & Entertainment

Operation Valentine | ఆపరేషన్ వాలంటైన్ నుంచి దేశభక్తి గీతం రిలీజ్

Operation Valentine - వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆపరేషన్ వాలంటైన్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. వాఘా సరిహద్దులో ఈ పాట రిలీజైంది.

Operation Valentine | ఆపరేషన్ వాలంటైన్ నుంచి దేశభక్తి గీతం రిలీజ్
X

వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ అడ్వెంచర్ 'ఆపరేషన్ వాలెంటైన్' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. 'వందేమాతరం' లిరిక్స్ తో సాగే ఈ పాటను అమృతసర్‌లోని ఐకానిక్ వాఘా సరిహద్దులో లాంచ్ చేశారు. బార్డర్ లో రిలీజ్ చేసిన తొలి సాంగ్ గా ఇది చరిత్ర సృష్టించింది.

టైటిల్ సూచించినట్లుగా వందేమాతరం దేశ స్ఫూర్తిని చాటే దేశభక్తి గీతం. వైమానిక దళ సైన్యం పెద్ద యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు చూపే ఈ పాట తమ దేశ రక్షణకు పోరాడే ధైర్యవంతులందరికీ నివాళి.

ఈ పాట గొప్ప ఉత్తేజాన్ని కలిగిస్తూ, గర్వంగా నిలబడేలా స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న వరుణ్ తేజ్, పాటలో యూనిఫాంలో ఫిట్‌గా కనిపించాడు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్, టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. యుద్ధంలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ (వరుణ్ తేజ్) గురించి ఆందోళన చెందే రాడార్ ఆఫీసర్‌గా కనిపించింది.

ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా.. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు. తెలుగులో అనురాగ్ కులకర్ణి, హిందీలో సుఖ్వీందర్ సింగ్ పాడారు.

ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. తెలుగు, హిందీలో ఫిబ్రవరి 16 న విడుదల కానుంది ఆపరేషన్ వాలంటైన్.

First Published:  17 Jan 2024 5:00 PM GMT
Next Story