Telugu Global
Cinema & Entertainment

Kotabommali PS | గీతాఆర్ట్స్ నుంచి మరో విలక్షణ చిత్రం

Kotabommali PS - గీతాఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి వస్తున్న మరో రీమేక్ మూవీ కోటబొమ్మాళి పీఎస్. ఈ సినిమా నుంచి రేపు సాంగ్ రాబోతోంది.

Kotabommali PS | గీతాఆర్ట్స్ నుంచి మరో విలక్షణ చిత్రం
X

తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకుంది గీతా ఆర్ట్స్ 2 సంస్థ. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు వచ్చాయి. వీటితో పాటు, కొన్ని ఇతర భాషల సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ అందుకుంది ఈ బ్యానర్.

తాజాగా మలయాళ సూపర్ హిట్ నాయాట్టుని రీమేక్ చేసింది జీఏ2. తెలుగులో ఈ రీమేక్ సినిమాకు కోటబొమ్మాళి పిఎస్ అనే పేరు పెట్టారు. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు కోట బొమ్మాళి PS మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. శ్రీకాకుళం ఫోక్ స్టయిల్ లో ఫస్ట్ సింగిల్ రెడీ చేశారు. ఈ సాంగ్ రేపు విడుదలవుతుంది.

ఆదివారం ఈ పాటకు సంబంధించి ఫస్ట్ టైమ్ హుక్ స్టెప్ ద్వారా ‘లింగి లింగి లింగిడి’ సాంగ్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. శ్రీకాకుళం పాటకు సిందేయండి అని ఇన్‌ప్లూయెన్సర్స్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

First Published:  10 Sep 2023 4:33 PM GMT
Next Story