Telugu Global
Cinema & Entertainment

Gopichand New Movie - గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ అప్ డేట్స్

Gopichand New Movie - గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం..

Gopichand New Movie - గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

గోపీచంద్, శ్రీను వైట్ల కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాలయాల్లో జరుగుతోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి హిమాలయాల సానువుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.

ఈ చిత్రం గోపీచంద్‌కి 32వ చిత్రం కావడం, చిత్రాలయం స్టూడియోస్‌కు తొలి చిత్రం కావడం, దర్శకుడు శ్రీనువైట్లకు రీఎంట్రీ మూవీ కావడం విశేషం.

దర్శకుడు శ్రీను వైట్ల ఈసారి హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. ఇటీవల ఇటలీలో, ఆ తర్వాత గోవాలో 2 భారీ షెడ్యూల్స్ పూర్తిచేశారు. ఇప్పుడు కశ్మీర్ లో మరో షెడ్యూల్ మొదలైంది. ఇందులో యాక్షన్‌తో పాటు శ్రీనువైట్ల మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది.

శ్రీనువైట్లతో పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాశాడు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారు.

First Published:  28 Jan 2024 2:49 AM GMT
Next Story