Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | లీక్ బారిన పడిన మహేష్ బాబు మూవీ

Guntur Kaaram | మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఇప్పుడీ సినిమా కూడా లీకుల బారిన పడింది.

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు
X

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో 13 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడీ సినిమాను లీకులు వెంటాడుతున్నాయి.

తాజాగా గుంటూరు కారం ఆన్ లొకేషన్ నుంచి 2-3 వీడియో క్లిప్పింగ్స్ లీక్ అయ్యాయి. వీటిలో మహేష్ బాబు మాస్ స్టెప్పులు ఉన్నాయి. ఈ సినిమా నుంచి దమ్ మసాలా అనే సాంగ్ ఇదివరకే రిలీజైంది. ఆ సాంగ్ కు సంబంధించిన స్టెప్పులే లీక్ అవ్వడం గమనార్హం.

ఆన్ లైన్ లో వీడియోలు లీక్ అయిన వెంటనే మేకర్స్ చర్యలు చేపట్టారు. వెంటనే వాటిని తొలిగించే ప్రయత్నం చేశారు. అయితే ఇంకా అక్కడక్కడ ఆ వీడియోలు కనిపిస్తున్నాయి. దీంతో స్వయంగా మహేష్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి, ఆ వీడియోల్ని తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

మహేష్-శ్రీలీల కాంబోలో తెరకెక్కుతున్న గంటూరుకారం సినిమాలో మీనాక్షి చౌదరి సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. హారిక హాసిని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా థియేటర్లలోకి వస్తోంది.

First Published:  21 Nov 2023 5:13 PM GMT
Next Story