Telugu Global
Cinema & Entertainment

Hansika | తన సినిమా స్టోరీలైన్ చెప్పిన హన్సిక

Hansika - చాన్నాళ్ల తర్వాత తెలుగులో సినిమా చేసింది హన్సిక. ఆ సినిమా గురించి గొప్పగా చెబుతోంది. పనిలోపనిగా స్టోరీలైన్ కూడా బయటపెట్టేసింది.

Hansika | తన సినిమా స్టోరీలైన్ చెప్పిన హన్సిక
X

దేశ‌ముదురు సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టిన హ‌న్సిక, తక్కువ టైమ్ లోనే క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై నిర్మించిన ఈ సినిమా, నవంబర్ 17న థియేటర్లలోకి వస్తోంది.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడింది హన్సిక. మై నేమ్ శృతి సినిమా కథను ఇప్పటివరకు తన జీవితంలో వినలేదని చెప్పుకొచ్చింది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా తనకు టాలీవుడ్ లో మరోసారి క్రేజ్ తెచ్చిపెడుతుందని అంటోంది.

‘‘థ్రిల్లర్‌ చిత్రాలను చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను. స్కిన్ గ్రాఫ్టింగ్ మాఫియా ముప్పును చెప్పే డార్క్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నేపథ్యంలో సినిమా చేయడం ఇదే తొలిసారి. నా పాత్ర ఇందులో ఓ ట్రాప్‌లో పడుతుంది. శృతి యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఆమె తనకు తానుగా బెయిల్ తెచ్చుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శృతి ఒక పోరాట యోధురాలు, ఆమెకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. దేనికీ వెనకడుగు వేయదు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. అలాంటి శృతికి ఓ భయంకరమైన, అధిగమించలేదని సమస్య ఎదురవుతుంది? దాని నుండి శృతి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్."

ఇలా సినిమా స్టోరీని బయటపెట్టింది హన్సిక. కోలీవుడ్ లో బిజీగా ఉండడం వల్లనే టాలీవుడ్ లో గ్యాప్ వచ్చిందని తెలిపిన హన్సిక, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలతో కలిసి సినిమాలు చేయడం తన అదృష్టం అంటోంది. వాళ్లు పాన్ ఇండియా స్టార్స్ గా ఎదగడం చూసి చాలా సంతోషించానని చెబుతోంది.

First Published:  16 Nov 2023 4:38 PM GMT
Next Story