Telugu Global
Cinema & Entertainment

Hanu-Man | 25 సెంటర్లలో వంద రోజులు

Hanu-Man Movie - హనుమాన్ సినిమా మరో సంచలనం సృష్టించింది. ఏకంగా 25 కేంద్రాల్లో వంద రోజులాడింది.

Hanu-Man | 25 సెంటర్లలో వంద రోజులు
X

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఏ మాత్రం అంచనాల్లేకుండా సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. గుంటూరుకారం లాంటి సినిమాల్ని కూడా అధిగమించి సిసలైన బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

ఇప్పుడీ సినిమా 25 కేంద్రాల్లో వంద రోజులు పూర్తిచేసుకోవడం మరో పెద్ద ఫీట్. ఓ సినిమా 2-3 వారాలు నిలబడ్డమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో హనుమాన్ సినిమా ఏకంగా వంద రోజులాడి సంచలనం సృష్టించింది.

92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు. 28వ తేదీన జీ తెలుగులో ఈ సినిమాను టెలికాస్ట్ చేయబోతున్నారు.

First Published:  22 April 2024 5:14 PM GMT
Next Story