Telugu Global
Cinema & Entertainment

Hanuman | ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్

HanuMan - తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా, ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా అవతరించింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఏ సినిమా ఈ స్థాయిలో హిట్టవ్వలేదు.

Hanuman | ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్
X

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ సెన్సేషన్ 'హను-మాన్ '92 సంవత్సరాల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మొదటి సినిమాగా వచ్చిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో 5 మిలియన్ల మార్క్‌ను అధిగమించింది.

ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. హిందీతో సహా అన్ని భాషల్లో అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఇక ఉత్తరాదిన, స్ట్రెయిట్ హిందీ సినిమాలా సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. టికెట్ రేట్లు పెంచకుండానే, బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టింది.

పెట్టిన పెట్టుబడికి, వచ్చిన రెవెన్యూతో పోల్చి చూసుకుంటే.. మరే ఇతర సంక్రాంతి సినిమాకు హనుమాన్ స్థాయిలో వసూళ్లు రాలేదు. అలా తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా ఆల్ టైమ్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన హను-మాన్ 3 వారాల రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు నాలుగో వారంలోకి ఎంటరైంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మరో 10 రోజులు ఈ సినిమా అద్భుతమైన రన్ కొనసాగించనుంది.

First Published:  2 Feb 2024 4:47 PM GMT
Next Story