Telugu Global
Cinema & Entertainment

Hanu-Man | బడ్జెట్ 5 రెట్లు పెరిగిందంటున్న నిర్మాత

Hanuman - హనుమాన్ సినిమా టీజర్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. దీంతో సినిమా బడ్జెట్ ను 5 రెట్లు పెంచారట. ఈ విషయాన్ని నిర్మాత ప్రకటించాడు.

Hanu-Man | బడ్జెట్ 5 రెట్లు పెరిగిందంటున్న నిర్మాత
X

నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా నిరంజన్ రెడ్డి తీసిన సినిమా హను-మాన్. ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. తేజ సజ్జ హీరోగా, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ సినిమాను తీశారు నిరంజన్ రెడ్డి.

హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత కె నిరంజన్ రెడ్డి విలేకరుల సమావేశంలో హనుమాన్ విశేషాలని పంచుకున్నారు.

"నిర్మాతగా తొలి సినిమాగా హను-మాన్ తీయడం చాలా ఆనందంగా ఉంది. తొలి సినిమానే ఇంత గ్రాండ్ స్కేల్ లో చేయడం, సంక్రాంతికి రావడం సంతోషంగా ఉంది. హను మాన్.. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన సూపర్ హీరో జానర్ మూవీ. ఆంజనేయ స్వామి చిరంజీవి. ఆయన ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉన్నారని మనం నమ్ముతాం. హనుమాన్ మన రియల్, యూనివర్సల్ సూపర్ హీరో. ఆంజనేయ స్వామిని ఎలా చూద్దామని అనుకుంటారో ఈ సినిమా చూసి బయటికి వచ్చినపుడు అది ఫుల్ ఫిల్ అవుతుంది."

అనుకున్న బడ్జెట్ కంటే హను-మాన్ కు 5 రెట్లు ఎక్కువ బడ్జెట్ అయిందని తెలిపాడు నిరంజన్ రెడ్డి. ఎప్పుడైతే టీజర్ హిట్టయితే, అప్పుడిక బడ్జెట్ పరిమితులు పెట్టుకోకూడదని నిర్ణయించినట్టు వెల్లడించాడు.

"మా నమ్మకాన్ని నిజం చేస్తూ బిజినెస్ అద్భుతంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలలో కేవలం థియేట్రికల్ గా 20కోట్లు జరిగింది. మాకున్న స్టార్ కాస్ట్ కి ఇది చాలా పెద్ద నెంబర్. ఓవర్సీస్, కర్ణాటక, నార్త్ ఇండియాతో పాటు నాన్ థియేట్రికల్ లో చాలా మంచి బిజినెస్ జరిగింది."

ఇప్పటికే హను-మాన్ సినిమాను కొంతమంది బయ్యర్లు చూశారు. వాళ్లంతా బాగుందని చెబుతున్నారు. సంక్రాంతికి మహేష్ నటించిన గుంటూరుకారం సినిమాతో పాటు, హను-మాన్ మూవీ థియేటర్లలోకి వస్తోంది.

First Published:  5 Jan 2024 4:41 PM GMT
Next Story