Telugu Global
Cinema & Entertainment

Hesham | మరో మ్యూజికల్ హిట్ అందించిన హేషమ్

Hesham's Idhi Idhi Maaya Song | విక్రాంత్ హీరోగా నటిస్తున్న సినిమా స్పార్క్ లైఫ్. ఈ సినిమా కోసం మంచి మెలొడీ కంపోజ్ చేశాడు హేషమ్.

Hesham | మరో మ్యూజికల్ హిట్ అందించిన హేషమ్
X

Hesham | మరో మ్యూజికల్ హిట్ అందించిన హేషమ్

ఖుషితో తెలుగులో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు మ్యూజిక్ డైరక్టర్ హేషమ్ అబ్దుల్ వహబ్. ఇప్పుడీ మ్యూజిక్ డైరక్టర్, మరో మంచి సాంగ్ ను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ‘స్పార్క్ లైఫ్’ సినిమాతో విక్రాంత్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతోన్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ఓ మంచి మెలొడీని రిలీజ్ చేశారు. హేషమ్ అందించిన ఈ సాంగ్, వినగానే ఆకట్టుకుంటోంది.

చిత్రయూనిట్ తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. తిరుపతిలోనే ఈ రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ రెండో పాట శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం, శ్రేయా ఘోషాల్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ద్వయం గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక హేషమ్ అందించిన బాణీ అయితే ఎంతో మెలోడియస్‌గా, వినసొంపుగా ఉంది.

సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోలోని విజువల్స్, ఫారిన్ లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. విక్రాంత్, మెహరీన్‌ల మీద చిత్రీకరించిన ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండినట్టుగా కనిపిస్తోంది.ఈ సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో తరువాత సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగినట్టు అయింది.

ఈ సినిమాలో విక్రాంత్ హీరో మాత్రమే కాదు.. కథా రచన, స్క్రీన్ ప్లేను కూడా అందిస్తున్నాడు. ఈ మూవీలో మెహరీన్, రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

హృదయం, ఖుషి చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. మలయాళీ నటుడు గురు సోమసుందరం ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు, నవంబర్ 17న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ థియేటర్లోకి రాబోతోంది.

First Published:  5 Oct 2023 2:31 AM GMT
Next Story