Telugu Global
Cinema & Entertainment

Shivani Rajasekhar | కోటబొమ్మాలి ఛాన్స్ అలా వచ్చింది!

Shivani Rajasekhar - మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ కోటబొమ్మాలి. మరి ఈ సినిమా ఆఫర్ శివానీ రాజశేఖర్ కు ఎలా వచ్చింది?

Shivani Rajasekhar | కోటబొమ్మాలి ఛాన్స్ అలా వచ్చింది!
X

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్‌’. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ శివాని రాజశేఖర్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడింది.

"ఆర్టికల్ 15 తమిళ్ రీమేక్ లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయి పాత్ర పోషించాను. ఇందులోనూ అలాంటి తరహా పాత్ర కావడంతో ఆయన నన్ను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఎన్నో మార్పులు చేశారు. షూటింగ్ మొదలయ్యాక సినిమాపై నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా."

మలయాళంలో సూపర్ హిట్టయిన నాయట్టు సినిమాకు రీమేక్ గా కోటబొమ్మాలి తెరకెక్కింది. ఈ సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత ఒరిజినల్ వెర్షన్ చూశానని, దానికి చాలా మార్పులుచేసి కోటబొమ్మాలి తెరకెక్కించారని అంటోంది శివానీ.

"ఈ ఆఫర్ వచ్చిన తర్వాత ఒరిజినల్ వెర్షన్ చూశాను. విలేజ్ లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాను. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. అలాగే నాన్నగారు చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించడంతో వారి నుంచి తెలియకుండానే ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా విషయంలో నా గెటప్ కోసం నాన్నగారు కూడా కొన్ని సలహాలు సూచనలు చేశారు."

24న థియేటర్లలోకి వస్తున్న కోటబొమ్మాలిపై చాలా ఆశలు పెట్టుకుంది శివానీ. ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని, తనకు మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందని ఆశపడుతోంది.

First Published:  16 Nov 2023 4:02 PM GMT
Next Story