Telugu Global
Cinema & Entertainment

Devara Movie | జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్

Janhvi Kapoor - దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది జాన్వి కపూర్. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Devara Movie | జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

ఎన్టీఆర్ ప్రస్తుతం తన తాజా చిత్రం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

జాన్వీ కపూర్ ఈ చిత్రంలో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఈ వివరాలను నటి స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన లుక్ ను వెల్లడించింది. బాలీవుడ్ బాంబ్ షెల్ గా, హాట్ హాట్ గా మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ.. దేవరలో మాత్రం సంప్రదాయబద్దంగా లంగావోణీలో కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, పాత సినిమాల్లో శ్రీదేవిలా ఉంది.

ఈ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 5న విడుదల కానుంది. 2016లో హిట్టయిన జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కలిసి నటిస్తున్న రెండో సినిమా దేవర. భారీ స్థాయిలో వస్తున్న ఈ సినిమా కోసం, భారీగా డబ్బు, టైమ్ వెచ్చిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

దేవర సినిమాపై జాన్వి కపూర్ చాలా హోప్స్ పెట్టుకుంది. బాలీవుడ్ లో ఆమె కెరీర్ అంతంతమాత్రంగా నడుస్తోంది. దేవర హిట్టయితే, సౌత్ లో పాతుకుపోదామని చూస్తోంది ఈ చిన్నది. అటు కొరటాల కూడా చాలా కసితో ఉన్నాడు. ఆచార్య డిజాస్టర్ తర్వా, దేవర సినిమాతో ఎలాగైనా తననుతాను నిరూపించుకోవాలనుకుంటున్నాడు.




First Published:  1 Nov 2023 5:05 PM GMT
Next Story