Telugu Global
Cinema & Entertainment

Janhvi Kapoor | జాన్వి కపూర్ వచ్చేసింది

Janhvi Kapoor - ఎట్టకేలకు దేవర మూవీ సెట్స్ లో జాయిన్ అయింది జాన్వి కపూర్. ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంటోంది.

Janhvi Kapoor | జాన్వి కపూర్ వచ్చేసింది
X

దేవర షూటింగ్ మళ్లీ మొదలైంది. గోవాలో మొదలైన ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచి బయల్దేరాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. లాంగ్ గ్యాప్ తర్వాత హీరోయిన్ జాన్వి కపూర్, దేవర సెట్స్ లో జాయిన్ అయింది. ప్రస్తుతం ఆమె గోవాలో లొకేషన్ లో ఉంది.

మంచి టాలీవుడ్ డెబ్యూ కోసం ఎదురుచూస్తున్న జాన్వి కపూర్, దేవర సినిమాలో నటించేందుకు అంగీకరించింది. ఎన్టీఆర్ సినిమా కావడంతో వెంటనే కాల్షీట్లు కేటాయించింది. అయితే ఎన్నో కారణాల వల్ల సినిమా షూటింగ్ లేట్ అయింది. దీంతో జాన్వి కపూర్ కాల్షీట్లు వేస్ట్ అయ్యాయి. అలా చాన్నాళ్లుగా సెట్స్ కు దూరంగా ఉన్న జాన్వి, ఎట్టకేలకు దేవర ప్రాజెక్టులోకి ఎంటరైంది.

ప్రస్తుతం గోవాలో ఎన్టీఆర్-జాన్వి మధ్య రొమాంటిక్ బీచ్ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ అందమైన బీచ్ సాంగ్ సినిమాకు హైలెట్ అవుతుందని చెబుతున్నారు. గోవాలోని బట్టర్ ఫ్లై బీచ్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇది పేరుకే బీచ్ సాంగ్. ఇందులో జాన్వికపూర్ బికినీ మాత్రం వేయడం లేదు.

ఈ చిత్రం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. సినిమాలో ఎన్టీఆర్‌కి విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై హరికృష్ణ కె, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  29 Oct 2023 3:10 PM GMT
Next Story