Telugu Global
Cinema & Entertainment

GOD Movie | గాడ్ మూవీ విడుదల తేదీ

Jayam Ravi's GOD Movie - గాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు జయం రవి. ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

GOD Movie | గాడ్ మూవీ విడుదల తేదీ
X

తనీ ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ తర్వాత జయం రవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’. అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

"క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ ఆదరణ ఉంటుంది. ఈ జానర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఉత్కంఠ రేకెత్తించేలా సినిమా తీస్తే చాలు హిట్ చేస్తారు జనం. అలా తమిళంలో సూపర్ హిట్ అనిపించుకుంది ఇరైవన్ అనే సినిమా. ఇప్పుడీ సినిమాను తెలుగులో గాడ్ పేరిట విడుదల చేస్తున్నారు.

తాజాగా తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ర‌న్ టైమ్‌ను 2 గంట‌ల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఇందులో మళ్లీ జత కట్టారు. అక్టోబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా కోలీవుడ్ లో పేరు తెచ్చుకుంది. తెలుగులో ఇది ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ సైకోగా నటించాడు. సినిమా కథ మొత్తం అతడి చుట్టూనే తిరుగుతుంది. అతడు ఎందుకు వరుస హత్యలు చేశాడనేది స్టోరీ. ఈ హత్యలకు హీరోయిన్ నయనతారకు ఏంటి సంబంధం అనేది మరో ట్విస్ట్.

విజ‌య‌ల‌క్ష్మి, న‌రైన్‌, ఆశిష్ విద్యార్థి త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు వేదాంతం సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా... యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ సినిమాతో తెలుగులో పాపులర్ అవ్వాలని చూస్తున్నాడు జయం రవి.

First Published:  11 Oct 2023 3:16 PM GMT
Next Story